గాంధీ జయంతి నేడు - బాపు గురించి మీకు తెలియని 10 విషయాలు.   10 Most Interesting Facts About Gandhiji     2017-10-02   01:30:15  IST  Raghu V

“కొంతమంది ఇంటిపేరు కాదురా గాంధీ, ఊరికొక్క వీధి పేరు గాంధీ. భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ. తరతరాల యతయాతన తీర్చిన వరదాతర గాంధీ” అన్నారు దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఈరోజు అక్టోబర్ 2, అంటే గాంధీ జయంతి. ఈ సందర్భంగా చాల తక్కువ మంది కి తెెలిసిన ఆయన జీవిిితంలోని 12 విషయాలు.

* గాంధీ బ్రిటీష్ సైన్యంలో కొన్నిరోజులు పనిచేసారు‌. అవును, ఆయన దక్షిణాఫ్రికా లో ఉన్నప్పుడు బ్రిటీష్ సైన్యంలో గాయపడిన వారిని మోసే స్ట్రెచర్ మ్యాన్ గా పనిచేసారు.

* సౌత్ ఆఫ్రికాలో ఉంటున్న సమయంలోనే గాంధీ రెండు ఫుట్ బాల్ క్లబ్స్ ని ప్రారంభించారు.

* మహాత్మా రోజుకి సగటున 18 కిలోమీటర్లు నడిచేవారట. ఇలా ఆయన 40 ఏళ్ళకు పైగా నడిచారు‌.

* 1921 నుంచి గాంధీ కేవలం ధోతి ధరించడం మొదలుపెట్టారు. అందుకు కారణం మధురైలో ఆయన బట్టలు కూడా లేకుండా ఎంతోమంది పేదవారిని చూడటం.

* గాంధీ శాకహారి. పాలు కొన్ని సంవత్సరాలు తాగకపోయినా, ఆ తరువాత ఆరోగ్య కారణాలరీత్య మేకపాలు తాగేవారు. ఆవు పాలు, బర్రె పాలు తాగేవారు కాదు.

* గాంధీ ఒకసారి కాదు ఏకంగా అయిదు సార్లు నోబెల్ శాంతి పురస్కరానికి నామినేట్ అయ్యారు. కాని ఒక్కసారి కూడా ఆయన్ని ఆ బిరుదు వరించలేదు. నమ్మండి .. ఇది నిజం.

* భారతదేశం బయట, ప్రపంచ నలుమూలల 48 పెద్ద నగరాల వీధులకు గాంధీ పేరుని పెట్టడం విశేషం.

* ఎడ్వీన్ ఆర్నాల్డ్ అనే పరదేశియుడు పరిచయం అయ్యేదాకా గాంధీ భగవద్గీత చదవకపోవడం విచిత్రం. గీతాపఠనం ఆయన జీవితాన్నే మార్చేసింది‌. ఎప్పుడు మానసిక సమస్యలు ఎదురైనా, కష్టాలు కనిపించినా, ఆయన భగవద్గీత చదివేవారు.

* ఆయనకి మహాత్మా అనే బిరుదుని రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చారు‌. ఇక జాతిపితగా మొదటిసారి పిలిచింది జవహర్ లాల్ నెహ్రూ.

* భారత దేశానికి స్వతంత్రం లభించి, నెహ్రూ ప్రసంగం ఇస్తున్న సమయంలో గాంధీ అక్కడ లేరు. బెంగాల్ లో మత అల్లర్లను చల్లార్చేందుకు అక్కడే శాంతియూతంగా పోరాటం చేస్తున్నారు.