గూగుల్ ప్లే స్టోర్ నుంచి మరో 10 యాప్స్ ఔట్..!

గూగుల్ సంస్థ ఈ మధ్య కాలంలో ఎవరైనా వారి కంపెనీకి సంబంధించిన రూల్స్ ను అతిక్రమించి కార్యకలాపాలు నిర్వహిస్తున్న యాప్స్ పై కాస్త సీరియస్ గానే కొరడా ఝులిపిస్తుంది.ఇందులో భాగంగానే తాజాగా ఆన్లైన్ లో రుణాలపై ప్రజలను వేధింపులకు గురి చేస్తున్న కొన్ని యాప్స్ పై తాజాగా గూగుల్ చర్యలు చేపట్టింది.

 Google Play Store Deleted 10 More Loan Apps, Google Play Store, Money Apps, Ex--TeluguStop.com

ఇందులో భాగంగానే కొన్ని యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది గూగుల్.భారతదేశ చట్టాలకు విరుద్ధంగా ఉన్న 10 యాప్స్ ను తాజాగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది.

భారతదేశ నియమ నిబంధనలు ఉల్లంఘించడం మాత్రమే కాకుండా వినియోగదారుల ప్రాణాలను బలి తీసుకుంటున్న నేపథ్యంలో గూగుల్ కు కొన్ని కంప్లైంట్స్ ఆధారంగా ఈ చర్యలు చేపట్టింది.
ఈ ప్రక్రియలో భాగంగా భారతదేశానికి చెందిన 10 భారతీయ లోన్ యాప్ లపై గూగుల్ చర్యలు చేపట్టడంతో వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించడం జరిగింది.

ఈ విషయాన్ని గూగుల్ తన బ్లాగ్ లో తెలియపరిచింది.దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.తాము ప్రభుత్వ సంస్థలు, కొందరు వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాత్రమే తాము భారతదేశంలోని పలు రుణ యాప్స్ పై సమీక్ష జరిపామని, ఆ తర్వాతనే వాటిని భద్రత కారణాల వల్ల గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించినట్లు తెలియజేసింది.అంతేకాదు మిగతా కొన్ని యాప్స్ కూడా స్థానిక చట్టాలకు కట్టుబడి ఉన్నాయో లేవో అన్న విషయాలను అడిగినట్లు వారు ఇచ్చే సమాచారాన్ని బట్టి వాటిని గూగుల్ ప్లేస్టోర్ లో ఉంచడం లేకపోతే తీసివేయడం అన్న పరిస్థితి ఉన్నట్లు గూగుల్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు.

Telugu Minuteloan, Extramudra, Google, Google Store, Googlestore, India, Loan Ap

ఇందులో భాగంగానే ప్లేస్టోర్ లో ఉన్న Ex- Money, 10minuteloan, Extramudra, stucred యాప్స్ తో పాటు మరో 6 యాప్ లను కూడా తొలగించినట్లు గూగుల్ తెలియజేసింది.ముఖ్యంగా మనుషుల ప్రాణాలను లెక్కచేయకుండా వారిని వేధిస్తూ చివరికి వారి చావులకు కారణమవుతున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు చేపట్టినట్లు గూగుల్ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube