రుయా హాస్పిటల్ లో చనిపోయిన కుటుంబాలకు 10 లక్షలు..!!

తిరుపతి రుయా హాస్పిటల్ లో సకాలంలో ఆక్సిజన్ అందక నిన్న 11 మంది చనిపోయిన సంఘటన తెలిసిందే.ఈ ఘటనతో ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ప్రభుత్వ అధికారులపై మండిపడి మృతుల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 10 Lakhs To The Families Of The Dead In Rua Hospital Ys Jagan, Tirupati, Rua Ho-TeluguStop.com

రుయా హాస్పిటల్ ఘటనతో ఆక్సిజన్ కొరత పై ఏపీ ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టడం జరిగింది.ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ బాధ్యతలను ముగ్గురు సీనియర్ అధికారులకు అప్పజెప్పింది.

కర్ణాటక, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాల నుండి వస్తున్న ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ బాధ్యతలను ఈ అధికారులు పర్యవేక్షించనున్నారు.

ఈ ఘటనతో అప్రమత్తమైన సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లు మరియు అధికారులతో పాటు మంత్రులతో సమావేశమయ్యారు.

మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులను సీఎం అప్రమత్తం చేయడం జరిగింది.ఈ సందర్భంగా మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఇదే క్రమంలో రుయా హాస్పిటల్ లో మరణించిన బాధిత కుటుంబ సభ్యులను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పలకరించడం జరిగింది.ఏదిఏమైనా రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా తాజా ఘటనతో జగన్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సరికొత్త ప్లానింగ్ తో రెడీ అయింది.

ఆల్రెడీ సింగపూర్ నుంచి భారీ స్థాయిలో టన్నుల కొద్ది ఆక్సిజన్ సిలిండర్లు రావటంతో.రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ఆక్సిజన్ నిల్వ ఉండేలా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube