ఎన్నికల సిరా (ఇంక్) గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు ఇవే..! ఎందుకు చెరిగిపోదు అంటే.?  

10 Interesting Facts About Indelible Voting Ink-ndustry Standard Electoral Inks,silver Chloride,silver Nitrate,voter Ink

ఓ టు వేశారా. అంటే నోటితో సమాధానం చెప్పనవసరం లేదు...

ఎన్నికల సిరా (ఇంక్) గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు ఇవే..! ఎందుకు చెరిగిపోదు అంటే.?-10 Interesting Facts About Indelible Voting Ink

సిరా గుర్తున్న వేలిని చూపిస్తే చాలు. సిరా చుక్కకి ఓటుకు ఉన్న సంబంధం అలాంటిది.

మనం ఓటు వేయడానికి పోలింగ్ బూతుకి వెళ్లగానే మన ఓటరు గుర్తింపు కార్డు పరిశీలించి అనంతరం అక్కడున్న సిబ్బంది మన చేతి వేలికి నేరేడు రంగులో ఉన్న సిరాను పూస్తారు గుర్తుందా.? నకిలీ ఓట్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఒకసారి ఓటు వేసిన వారిని గుర్తు పెట్టేందుకు భారత ఎన్నికల సంఘం ఈ విధానాన్ని దశాబ్ధాలుగా అమలు చేస్తోంది.

సిరా పూసిన వేలితో సెల్ఫీలు దిగి. తాము కూడా ఓటు వేశామని చూపించి గర్వంగా ఫీలవుతారు భారతీయులు.

ఇంతటి ప్రాధాన్యత కలిగిన సిరా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

1. ఈ సిరాను కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీ తయారు చేస్తోంది.దేశంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ కంపెనీ నుంచే సిరా సరఫరా అవుతుంది.

2. అంతేకాకుండా 29 దేశాలకు దీనిని ఎగుమతి చేస్తున్నారు. కెనడా, కాంబోడియా, మాల్దీవులు, నేపాల్‌, నైజీరియా, దక్షిణాఫ్రికా, టర్కీ దేశాల ఎన్నికల అవసరాలకు ఇక్కడి నుంచే ఇంక్‌ సరఫరా అవుతుండటం గమనార్హం.

3. దాదాపు 15 రోజులపైగా వేలిపై చెరిగిపోకుండా ఉండటం ఈ ఇంక్‌ ప్రత్యేకత.

4. 1962 సార్వత్రిక ఎన్నికలప్పటి నుంచి మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ కర్మాగారం ఉత్పత్తి చేస్తున్న చెరిగిపోని సిరానే వినియోగిస్తున్నారు.

5. 1987లో అప్పటి మైసూరు మహారాజు నాల్మడి కృష్ణరాజవడయారు ఈ సిరా తయారీ కర్మాగారాన్ని స్థాపించారు. అప్పుడు దీని పేరు మైసూర్‌ లాక్‌ అండ్‌ పెయింట్‌ వర్స్క్‌.

6. 1989లో దాని పేరును మైసూర్‌ లాక్‌ అండ్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ సంస్థగా మార్చారు. స్వాతంత్య్రానికి ముందు వరకు మైసూరు రాజుల స్వాధీనంలో ఉండేది.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వపరమైనది. తొలుత ఈ పరిశ్రమను స్థాపించారు.

7. 1962లో ఒక ఓటరు పలుమార్లు ఓట్లేయకుండా నివారించేందుకు చెరిగిపోని సిరాను ఉత్పత్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబరేటరీస్‌ ఫార్ములాతో సిరా ఉత్పత్తి బాధ్యతను ఈ కర్మాగారానికి అప్పగించారు.

8. నేరేడు రంగులో ఉండే ఈ సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉన్నందున వెంటనే చెరిగిపోదు.

9. మొదట్లో ఎడమ చేతి వేలిపై సిరా చుక్కను పెట్టేవారు. 2006 ఫిబ్రవరి నుంచి ఓటర్ల ఎడమ చేతి వేలు గోరుపై సిరాను గీతగా పెడుతున్నారు.

10. ఈ సారి తెలంగాణకు 2 లక్షల సిరా సీసాల్సి సరఫరా చేస్తున్నారు. ఒక్కో సీసా సిరాను 500 – 700 మందికి వేయవచ్చు.