మహేష్ బాబు టక్కరి దొంగ సినిమాలో పాటలా ఇతర దేశాలతో పోలిస్తే చైనా దేశం నియమ నిబంధనలు వింతగా ఉంటాయి.చైనాలో చివరకు పాఠశాలల్లో సైతం భయంకరమైన నియమాలు అమలవుతున్నాయి.
ఈ నిబంధనలు విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.చైనాలోని జింగ్లీ నగరంలో అబే టీచర్ ట్రైనింగ్ అనే స్కూల్ ఉంటుంది.
ఈ స్కూల్ లో చదువుకునే విద్యార్థులు రాత్రి సమయంలో టాయిలెట్స్ కు కానీ బాత్ రూమ్ లకు కానీ వెళ్లటంపై నిషేధం ఉంది.
ఎవరైతే ఈ నియమానికి అంగీకరిస్తారో వారికి మాత్రమే పాఠశాలలోకి అనుమతి ఇస్తారు.రాత్రివేళలో టాయిలెట్ కు అని వెళ్లి కొందరు విద్యార్థులు అసభ్యకరమైన పనులు చేయడంతో ఆ స్కూల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.చైనాలో మరికొన్ని స్కూల్స్ లో బకెట్స్ లో మాత్రమే టాయిలెట్ పోయాలనే నిబంధన ఉంది.
ఇలా బకెట్స్ లో పోసిన యూరిన్ ను అక్కడి వ్యాపారులు కొనుగోలు చేస్తారని… ఈ యూరిన్ లో ఉడకబెట్టిన గుడ్లు అక్కడ చాలా ఫేమస్ అని సమాచారం.అక్కడ ఈ గుడ్లను చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు తినడానికి ఉపయోగిస్తారు.
చైనాలోని కొన్ని స్కూళ్లలో పిల్లలు పరీక్షల్లో ఇతరుల పేపర్ ను చూడకుండా పేపర్ తో తయారు చేసిన వింత క్యాప్స్ ను ఉపయోగిస్తారు.
చైనాలోని కొన్ని పాఠశాలల్లో వారానికి ఒకటి లేదా రెండుసార్లు విద్యార్థులే పాఠశాలలను శుభ్రం చేయాల్సి వస్తుంది.పిల్లలు ఈ విధంగా చేయడం వల్ల పిల్లలు ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారని భావిస్తారు.
చైనాలోని ఐరన్ ఫ్రావిన్స్ అనే ప్రాంతంలో ఐనా బోనా జియాంజియ్ అనే స్కూల్ ఉంది.ఈ స్కూల్ లో ఉదయం 6.45 గంటలకు విద్యార్థులకు ఫాస్ట్ వాక్ చేస్తే మాత్రమే 9.30 గంటలకు పాఠశాలలోకి అనుమతి ఇస్తారు.చైనాలోని చెంగ్మూర్ నగరంలో ఉన్న జైన్ వొకేషనల్ స్కూల్ లో జాయిన్ కావాలంటే ఆ స్కూల్ లో ముందుగానే కుట్టించిన యూనిఫామ్ లతో పాటు థర్మల్ అండర్ వేర్ లను కొనుక్కోవాల్సి ఉంటుంది.
ఆ పాఠశాలలో యూనిఫామ్ కొనని విద్యార్థులను పరీక్షలకు అనుమతించరు.
చైనాలో షెంగ్యాంగ్ పాలిటెక్నిక్ అనే ఒక యూనివర్సిటీ ఉంది.ఈ యూనివర్సిటీలోకి విద్యార్థులు సైకిల్ లేదా బైక్ తెచ్చుకోవడంపై నిషేధం ఉంది.చైనాలో ఎక్స్పరిమెంటల్ ప్రైమరీ స్కూల్ అనే ఒక స్కూల్ ఉంది.
ఈ స్కూల్ లో ప్రతి విద్యార్థి రోజూ మూడు ఐస్ క్రీమ్ లు తినాలి.ఈ విద్యార్థులపై పరిశోధనలు చేసి అక్కడి పరిశోధకులు కీలక విషయాలను వెల్లడిస్తూ ఉంటారు.
చైనాలోని లీజియో హో అనే స్కూల్ లో సెక్యూరిటీ విద్యార్థుల యొక్క అన్ని పాకెట్లను, స్కూల్ బ్యాగ్ లను, లంచ్ బాక్స్ లను చెక్ చేస్తారు.గతంలో విద్యార్థుల దగ్గర సిగరెట్లు, డ్రగ్స్ దొరకడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.చైనాలోని హొజో ఎయిటీన్త్ అనే స్కూల్ లో అమ్మాయిలు, అబ్బాయిలు క్లాస్ లో ఒకరితో ఒకరు మాట్లాడకూడదనే నిబంధన ఉంది.