వామ్మో.. ఇంత పెద్ద చేపను ఎప్పుడైనా చూసారా ..?!

ఈ మధ్యకాలంలో కొన్ని రకాల జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మనం తరచు గమనిస్తూనే ఉన్నాం.ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ గా మారుతుంటాయి .

 10 Feet Marine Eel Fish Found In Kakinda,kakinada Fish Market, Marine Eel Fish,-TeluguStop.com

తాజాగా ఓ రకానికి చెందిన చేప చూడడానికి చాలా వింతగా కనిపిస్తూ చూపరులను ఆకర్షిస్తోంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.

తాజాగా తూర్పుగోదావరి జిల్లా పాలక కేంద్రమైన కాకినాడలో ఓ జాలరికి 10 అడుగుల పొడవైన చేప లభించింది.ప్రస్తుతం ఈ చేప మార్కెట్ లో అందరిని అబ్బురపరుస్తుంది.

కాకినాడ నగరంలోని కుంభాభిషేకంలో ఉన్న ఓ మార్కెట్లో ఈ అరుదైన చేపను జాలరి విక్రయించేందుకు ప్రయత్నం చేశాడు.స్థానిక మత్స్యకారుడు చేపను విక్రయించేందుకు మార్కెట్ కు తీసుకురాగా ఆ విచిత్రమైన చేపని చూసి అక్కడి స్థానికులు కొందరు ఆ చేపను పాము అని భ్రమపడ్డారు.

అయితే, అతడు పట్టుకున్నది పాము కాదు చేప అని తెలిసిన తర్వాత అందరు ఆశ్చర్యపోవడం వారి వంతు అయింది.అది సముద్రం చేప అని మత్స్యకారుడు చెప్పడంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నట్లు అయింది.

Telugu Feetmarine, Kakinada Fish, Marine Eel Fish, Rare Fish, Snake-Latest News

ఈ 10 అడుగులు ఉన్న పొడవాటి చేపను కొంత సమయం తర్వాత నగరంలోని ఓ వ్యక్తి కొనుగోలు చేసి తీసుకువెళ్ళిపోయాడు.ఈ చేప పేరు మెరైన్ ఈల్.ఇలాంటి చేపలు తెలుపు నలుపు రంగులో కలిసి మిళితమై ఉన్న రంగులలో ఎక్కువగా కనిపిస్తాయని, అంతేకాకుండా వివిధ రంగుల్లో కూడా ఇవి లభిస్తాయని కాకినాడ పట్టణంలోని మత్స్యకార అధికారులు తెలియజేశారు.నల్ల రంగు ఉన్న చేపలను ఎక్కువగా పీతల మేతగా ఉపయోగిస్తారు అని వారు తెలియజేశారు.

ఈ చేపకు శాస్త్రీయ నామంగా ఏంజెల్లా టైకాలర్ అని పిలుస్తారు.ఇలాంటి చేపలు ఇదివరకు కూడా కాకినాడ పట్టణంలో అనేక మందికి చిక్కాయని మళ్లీ చాలా రోజుల తర్వాత ఇలాంటి చేప లభించిందని అధికారులు తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube