పాకిస్తాన్ లో ఘోరం మంచు తుఫాన్ బీభత్సం పదిమంది మృతి..!!

పాకిస్తాన్ ( Pakistan )దేశం ప్రకృతి విలయానికి విలవిలలాడుతోంది.తాజాగా ఆ దేశంలో మంచు తుఫాన్( Snow Storm ) బీభత్సం సృష్టిస్తోంది.

 10 Dead In Severe Snow Storm In Pakistan Snow Storm Details, Pakistan,snow Storm-TeluguStop.com

భారీగా హిమపాతం( snowfall ) కురుస్తోంది.మంచు వర్షం దాటికి రోడ్లు, చెట్లు, ఇల్లు… అన్ని మంచులో కూరుకుపోయాయి.

హిల్ ప్రాంతం ముర్రెలో దట్టమైన మంచు కురుస్తూ ఉండటంతో పలు వాహనాలు మంచులో చిక్కుకుపోయాయి.ఈ క్రమంలో కొంతమంది పర్యాటకులు ఇటీవల కారులో చిక్కుకుపోయి మరణించడం జరిగింది.

మంచు అందాలను వీక్షించేందుకు సొంత వాహనాలలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు కొండ ప్రాంతాల్లోకి వెళ్లి చిక్కుకుపోయి.పేరుకుపోయిన మంచు కుప్పలో బయటకు రాలేక చాలా మంది చనిపోతున్నారు.ఆ ఘటన మరువకముందే తాజాగా మరో 10 మంది మరణించినట్లు( 10 members Dead ) అధికారులు తెలియజేశారు.ఇదే సమయంలో మరో 10 మంది గాయపడినట్లు పిఓకే నుంచి 35 మంది సంచార జాతుల వారు వలస వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇదే సమయంలో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు.సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube