క్షుద్రపూజలు చేసి భర్తను చంపేస్తానంటూ ఆమెను లొంగదీసుకున్నాడు, ఇంకా ఎంతకాలం ఈ మూడనమ్మకాలు  

Woman Cheated By Baba-jharkhand,village,women Cheated

ప్రస్తుతం మనం కంప్యూటర్‌ యుగంలో ఉన్నాం. అయినా కూడా కొందరు వందల ఏళ్ల నాటి పాత మూడ నమ్మకాలను నమ్ముతున్నారు. వారు నమ్మడంతో పాటు ఇతరులను మోసం చేసేందుకు ఆ మూడ నమ్మకాలను వినియోగించుకుంటున్నారు..

క్షుద్రపూజలు చేసి భర్తను చంపేస్తానంటూ ఆమెను లొంగదీసుకున్నాడు, ఇంకా ఎంతకాలం ఈ మూడనమ్మకాలు-Woman Cheated By Baba

అత్యంత దారుణమైన మూడ నమ్మకాలను ఇండియన్స్‌ ఫాలో అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మూడ నమ్మకాలు ఉన్నాయి. కాని ఇండియాలో మాత్రం వీటిని క్రైమ్‌కు కూడా ఉపయోగిస్తున్నారు.

ఇతరుల మూడ నమ్మకాలను క్యాష్‌ చేసుకునేందుకు ఎంతో మంది క్యూ కడుతున్నారు. ఇతరుల మూడ నమ్మకాలను ఆసరాగా చేసుకుని వారి నుండి డబ్బు లాగడంతో పాటు మరో విధంగా కూడా ఉపయోగించుకుంటున్నారు.

ఇటీవల జార్ఖండ్‌కు చెందిన ఒక పల్లె జంట ఇంట్లో ఇబ్బందులు కలుగుతున్నాయంటూ ఒక భూత వైధ్యుడి వద్దకు వెళ్లారు. అతడు కొన్ని పూజలు చేయాలని, ఇంట్లో దుష్ట శక్తి ఉందని చెప్పాడు.

దాంతో పూజలకు సరే అన్నారు. ఆ తర్వాత రెండు మూడు సార్లు తన వద్దకు రావాలని ఆ జంటకు సూచించారు. అయితే భర్త పనికి పోవడంతో భార్య ఒక్కతే ఆ క్షుద్ర పూజారి వద్దకు వెళ్లేది..

ఆ సమయంలోనే ఆమెలోని భయాలు అతడికి అర్థం అయ్యాయి. అప్పుడే ఆమె వీక్‌నెస్‌ తెలుసుకుని నీ భర్తకు ఎవరో క్షుద్ర పూజ చేసి వదిలారు. అతడు మెల్ల మెల్లగా చచ్చి పోతున్నాడు అంటూ ఆమెను భయపెట్టాడు.

అతడి పై నుండి ఆ ప్రభావంను తాను మాత్రమే తొలగించగలను అని చెప్పాడు. అది చేసింది తనకు తెలిసిన శిష్యుడే అని, మీరు అంటే గిట్టని వారు ఎవరో చేయించారని చెప్పాడు. దాంతో ఆమె కన్నీరు పెట్టుకోవడం మొదలు పెట్టింది. భయపడనక్కర్లేదు.

లక్ష రూపాయలు ఇస్తే నేను అతడిని కాపాడుతాను, ఈ విషయాన్ని అతడికి తెలియనీయవద్దు అన్నాడు. భర్తకు తెలియకుండా లక్ష తీసుకు రావడం తన వల్ల కాదు అంది. అప్పుడే అతడి దుష్ట బుద్దిని బయట పెట్టాడు..

నీ భర్తను కాపాడుకోవాలంటే నాకు సహకరించాలని అడిగాడు.

ఆమె వద్ద మరో మార్గం లేక పోవడంతో ఒప్పుకుంది. మాయ మాటలతో ఆమెను బుట్టలో వేసుకుని ఏవో పూజలు చేస్తున్నట్లుగా నాటకం ఆడుతూ ఆమెను పలు సార్లు తన వద్దకు రప్పించుకుని అఘాయిత్యం చేశాడు.

అనుమానం వచ్చిన భర్త గట్టిగా భార్యను నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆ క్షుద్ర పూజారిని అరెస్ట్‌ చేశారు.