పిస్తోల్ పట్టిన నేతకి బీజేపీ ఊహించని వార్నింగ్! ఆరు ఏళ్ల పాటు ఇక అంతే  

Uttarakhand Mla Pranav Singh Champion Suspended-

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలచేత ఎన్నుకోబడిన నేతలు ప్రజలకి అండగా ఉండాలి.ప్రజల తరుపున చట్ట సభలలో గళం విప్పాలి.అలా కాకుండా అధికార మదం నెత్తికెక్కి ప్రజలని తోక్కేస్తా, ప్రశ్నిస్తే చంపేస్తా అంటూ భయపెట్టే వేషాలు వేస్తే ఏదో ఒక రోజు ప్రజల నుంచి కాని, పార్టీ నుంచి కాని గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది...

Uttarakhand Mla Pranav Singh Champion Suspended--Uttarakhand MLA Pranav Singh Champion Suspended-

ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ కి కూడా అదే పరిస్థితి వచ్చింది.ఆ మధ్య మందు కొట్టి, తుపాకులు పట్టుకుని డ్యాన్స్ చేస్తూ దర్జాగా వీడియోలు తీసుకున్న ప్రణవ్ సింగ్ అది ఎంత పెద్ద తప్పో తెలుసుకోలేకపోయాడు.తన ఘనకార్యం కాస్తా సోషల్ మీడియాలోకి వచ్చి వైరల్ కావడంతో సదరు బీజేపీ ఎమ్మెల్యే కి అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఈ చర్యపై పార్టీ ఆయన్ని వివరణ కోరింది.అయితే ప్రణవ్ సింగ్ అధిష్టానం కి కూడా కాస్తా పొగరుగా సమాధానం చెప్పడంతో పార్టీ అతనిని బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది.అతని చేతలు, మాటలు సరైన విధంగా లేకపోవడంతో ఆరు సంవత్సరాలు పాటు సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.

Uttarakhand Mla Pranav Singh Champion Suspended--Uttarakhand MLA Pranav Singh Champion Suspended-

మొత్తానికి పిస్తోల్ లో సందడి చేసిన ప్రజా నాయకుడు మీద పార్టీ క్రమశిక్షణ చర్యలు గట్టిగానే తీసుకుంది అని చెప్పాలి.