ప్చ్ ఇక్కడ పుంజుకోవడం కష్టమేనా ? అలా ఫిక్స్ అయ్యారా ?  

Tdp Back In Rayalaseema-

తరుచుగా చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులు వైసీపీని ఉద్దేశించి మాట్లాడే మాటల్లో ప్రధానంగా ఉండే పదాలు ఫ్యాక్షనిస్టులు, రాయ‌ల‌సీమ రౌడీలు, క‌డ‌ప రౌడీలు వంటి మాటలు ఉపయోగిస్తూ జగన్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించేవారు.అయితే ఇవన్నీ సీమ ప్రజలు జగన్ తమవాడని అనుకులే చేశాయి.అంతే కాకూండా రాయలసీమలో ఈసారి జ‌గ‌న్ ఉప‌యోగించిన సామాజ‌క‌వ‌ర్గ స‌మీక‌రణాల ఫార్ములా బాగా వర్కవుట్ అయ్యింది.

Tdp Back In Rayalaseema--TDP Back In Rayalaseema-

2014 లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చినా రాయలసీమలో వైసీపీకి మెజారిటీ సీట్లు రావ‌డం, 2019 ఎన్నికల్లో మూడు స్థానాలు మినహా మిగతా అన్ని స్థానాల్లో స్వీప్ చేయ‌డంతో సీమ టీడీపీ నాయకుల్లో ఆందోళన పెరగడానికి కారణం అయ్యింది.మొన్న‌టిఎన్నిక‌ల్లో టీడీపీ దారుణ ఓట‌మికి రాయలసీమలో బాగా వెనకబడిపోవడం కూడా ఒక కారణమే.రాయలసీమ‌లోని నాలుగు జిల్లాల్లో మొత్తం 52 అసెంబ్లీ సీట్ల‌లో కేవ‌లం మూడు స్థానాల‌కే టీడీపీ ప‌రిమితం అయిపొయింది.

ఇక తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కుప్పం, హిందూపురంతో పాటు ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రమే టీడీపీ గట్టెక్కగలిగింది.వైసీపీ మిగతా 49 సీట్ల‌లో ఘ‌న విజ‌యం సాధంచింది.అయితే టీడీపీకి ముందు నుంచి బాగా పట్టున్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఆ పార్టీ దారుణంగా ఓటమి చవిచూసింది.

హేమాహేమీలుగా చెప్పుకునే నాయకులు కూడా ఓట‌మి చెందారు.గ‌త ఎన్నిక‌ల్లోనూ వైసీపీ రాయ‌ల‌సీమ‌లో టీడీపీ కంటే ఎక్కువ సీట్లు సాధించింది.ఈసారి ఏకంగా క్లీన్ స్వీప్ చేయడంతో ఇప్పుడు రాయ‌ల‌సీమ టీడీపీ నాయకుల భ‌విష్య‌త్‌పై బెంగ మొదలయ్యింది.

సీమ‌లో వైసీపీ ప‌ట్టు పెర‌గ‌డానికి గ‌త ఐదేళ్లు టీడీపీ రాజ‌కీయం కూడా ఒక కార‌ణ‌మే.

టీడీపీ హ‌యాంలో రాయ‌లసీమను నిర్ల‌క్షం చేశార‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో ఎక్కువగా ఉంది.రాయల సీమ‌కు టీడీపీ ప్ర‌భుత్వం సాగు నీరు అందించే ప్ర‌య‌త్నం చేసినా ఎన్నికల సమయంలో మాత్రం అది ప‌నిచేయ‌లేదు.ఈ నేపథ్యంలో ఇప్పుడు రాయలసీమ టీడీపీ నేతల్లో కొత్త ఆలోచనలు రేకెత్తుతున్నాయి.అసలు పార్టీలో ఉండాలా, ఉంటే భ‌విష్య‌త్ ఉంటుందా అనే సందిగ్ధత టీడీపీ నాయకుల్లో పెరిగిపోయింది.

పార్టీలో ఉంటే ఈ ఐదేళ్లు ఎలాగోలా గెంటుకొద్దామనుకున్నా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి గెలుస్తామ‌న్న ధీమా వారిలో కనిపించడంలేదు.త‌మ‌కు వ్య‌క్తిగ‌తంగా నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లం ఉన్నావైసీపీని భవిష్యత్తులో కూడా ఎదుర్కోవడం కష్టమనే భయం వారిలో పెరిగిపోయింది.

అందుకే కొంతమంది వైసీపీ వైపు చూస్తుంటే, అందులో చేరడానికి ఇబ్బందులు ఉన్నవారు బీజేపీ వైపు చూస్తున్నారు.