ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా వైఎస్ చౌదరి ?  

Sujana Chowdary Key Role Play In Ap-

ఏపీ, తెలంగాణల్లో బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ వైకిరి ఒకపట్టన ఎవరికీ అర్ధం కావడంలేదు.రాజకీయ ఎత్తుగడలు ఎవరికీ అందని రీతిలో వేస్తూ సరికొత్త రాజకీయానికి నాంది పలుకుతోంది.ముఖ్యంగా ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు కోటరీ నాయకులందని తమ పార్టీలో చేర్చుకుని పెద్ద షాకే ఇచ్చింది...

Sujana Chowdary Key Role Play In Ap--Sujana Chowdary Key Role Play In Ap-

చంరబాబు కి అత్యంత సన్నిహితులుగా ఉన్న యలమంచిలి సుజనా చౌదరి ని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఆయనకు ఇప్పుడు ఎక్కడలేని ప్రాధాన్యం కల్పిస్తోంది.అంతే కాదు రాబోయే రోజుల్లో సుజనా చౌదరి ని ముందు పెట్టి టీడీపీ ని వీక్ చేయాలని చూస్తోంది.బీజేపీలో చేరిన తర్వాత ఏపీకి వచ్చిన సుజనాచౌదరికి సన్మానం చేసి సత్కరించేందుకు బీజేపీ నేతలు పోటీ పడడం చూస్తుంటే ఇది నిజమేనేమో అన్నట్టు పరిస్థితి కనిపిస్తోంది.

Sujana Chowdary Key Role Play In Ap--Sujana Chowdary Key Role Play In Ap-

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జ్ సునీల్‌ దేవ్‌ధర్‌ కూడా సుజనా సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సునీల్ దేవ్‌ధర్‌ మాట్లాడుతూ చంద్రబాబు జైలుకు వెళ్లడం తప్పదని మాట్లాడారు.అయితే సుజనా చౌదరి మాత్రం చంద్రబాబును కేంద్ర ప్రభుత్వం జైలుకు పంపుతుందని తాను అనుకోవడం లేదన్నారు.గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందా లేదా అన్నది విచారణ జరిపిస్తే గానీ చెప్పలేమంటూ మాట్లాడారు.

అయితే చంద్రబాబు పరిపాలనలో వ్యవస్థ గాడి తప్పింది అంటూ వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా సుజనా చౌదరిని ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్‌ కూడా అప్పుడే బీజేపీలో మొదలయిపోయింది.ఆయన్ను అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా ఏపీలో టీడీపీ స్థానాన్నిసులువుగా అగ్రమించవచ్చని బీజేపీ ప్లాన్ వేస్తోంది..

సుజనా ను ముందు పెట్టడం వల్లే ఇదంతా సాధ్యమవుతుందంటూ బీజేపీలో కొంతమంది వాదిస్తున్నారు.అంతే కాకుండా టీడీపీ నుంచి వచ్చే నేతలకు పార్టీపై నమ్మకం కలుగుతుందంటూ లాజిక్ చెబుతున్నారు.ఇలా చెబుతున్నవారంతా టీడీపీ గూటి నుంచి వచ్చినవారే కావడం గమనార్హం.అయితే మరో వర్గం మాత్రం సుజనాచౌదరి పెత్తనంపై అప్పుడే పెదవి విరుస్తున్నారు.

బీజేపీ ఇంతకాలం విలువలున్న పార్టీ అన్న భావన ఉండేదని ఇప్పుడు వలస నేతలకు కీలక పదవులు అప్పగిస్తామని సంకేతాలు ఇవ్వడం ద్వారా పార్టీ క్యాడర్ లో ఇప్పటివరకు ఉన్న నమ్మకం పోతుందని వ్యాఖ్యానిస్తున్నారు.బీజేపీ మాత్రం ఈ విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తోంది.ఒకవైపు జనసేన అధినేతను బీజేపీలో చేర్చుకోవాలనే ప్లాన్ వేస్తూనే ఇప్పుడు సుజనా పేరు తెరపైకి వచ్చేలా చేయడం వెనుక రాజకీయం ఎవరికీ అంతుపట్టడం లేదు...