లోకేష్ కు ఛాలెంజ్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే  

Sudhaker Babu Comments On Nara Lokesh-nara Lokesh,sudhaker Babu,tdp,ycp,టీడీపీ అధినేత కుమారుడు లోకేష్,మాజీ టీడీపీ మంత్రి

మాజీ టీడీపీ మంత్రి,టీడీపీ అధినేత కుమారుడు లోకేష్ కు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఛాలెంజ్ విసిరారు. నాలుగు పదాలు సరిగ్గా పలకలేని వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని లోకేష్ ప్రెస్‌మీట్ పెట్టి గుంటూరు, మంగళగిరి, డెంగ్యూ పదాలను పలకాలంటూ ఛాలెంజ్ విసిరారు. ఆయన ఈ మూడు పదాలను వరుసపెట్టి పలకలగలిగితే మాత్రం ఆయన చంద్రబాబుకు నిజమైన రాజకీయ వారసుడిగా ఒప్పుకుంటామంటూ ఆయన వ్యాఖ్యానించారు..

లోకేష్ కు ఛాలెంజ్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే -Sudhaker Babu Comments On Nara Lokesh

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన చూసి టీడీపీ నేతలకు భయం మొదలయ్యిందని, గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా చంద్రబాబు, లోకేష్‌లకు బుద్ది రాలేదంటూ కామెంట్ చేసారు.

40 రోజుల పాలనలో జగన్ ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. దీన్ని చూసి ఓర్వలేక తమపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. సీఎం జగన్‌పైనా, ఎంపీ విజయసాయిరెడ్డిపై లోకేష్ కౌంటర్లు ఇస్తున్న నేపథ్యంలో లోకేష్ దయచేసి తెలుగు నేర్చుకోవాలన్నారు ఇక నైనా ఆయన హుందాగా వ్యవహరించాలని కోరారు.

అయితే మరి దీనిపై లోకేష్ ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.