గణేష్ నిమజ్జనానికి తీన్మార్ స్టెప్పులు వేసిన సల్లు భాయ్  

Salman Khan Dance At Arpitha Khans Ganesh Visarjan-salman Dance At Ganapathi,salman Khan

బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్రహ్మచారి,కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా ల్లో ఎలా హుషారుగా ఉంటాడో,బయట కూడా అలానే ప్రవర్తిస్తూ ఉంటాడు.ఇంత స్టార్ డమ్ అందుకున్నప్పటికీ కూడా ఎలాంటి గర్వం లేకుండా చాలా సామాన్యుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు.అయితే తాజాగా సల్మాన్ గణపతి నిమజ్జనం సమయంలో అందరి ముందు తీన్మార్ స్టెప్పులు వేసి మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు...

Salman Khan Dance At Arpitha Khans Ganesh Visarjan-salman Dance At Ganapathi,salman Khan-Salman Khan Dance At Arpitha Khans Ganesh Visarjan-Salman Ganapathi

సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ ప్రతి ఏడాది తన ఇంట్లో వినాయకుడిని నెలకొల్పి ఘనంగా పూజలు నిర్వహిస్తూ ఉంటుంది.అయితే ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా అర్పితా గణేష్ ని నిలబెట్టి ఘనంగా పూజలు నిర్వహించింది.అయితే మంగళవారం ఆ గణేష్ ని నిమజ్జనం చేశారు.

ఈ క్రమంలో సల్మాన్,స్వర భాస్కర్, డైసీ షా లు తమ తీన్మార్ స్టెప్పులతో అలరించారు.అయితే అందరి లోకి కూడా సల్మాన్ వేసిన స్టెప్పులు పలువురిని ఆకట్టుకున్నాయి.బీట్స్‌కి త‌గ్గ‌ట్టుగా స‌ల్మాన్ వేసిన స్టెప్పులకు అక్కడకు వచ్చిన వారు ఫిదా అయిపోయారు.

Salman Khan Dance At Arpitha Khans Ganesh Visarjan-salman Dance At Ganapathi,salman Khan-Salman Khan Dance At Arpitha Khans Ganesh Visarjan-Salman Ganapathi

దీనితో కొందరు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఈ వీడియో తో పాటు సల్మాన్ త‌న మేన‌ల్లుడు అహిల్‌ని ఎత్తుకొని వినాయ‌కుడికి హార‌తి ఇస్తున్న వీడియో, అలానే త‌న త‌ల్లి స‌ల్మా ప‌క్క‌న కూర్చొని భ‌జ‌న చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి.ప్రస్తుతం సల్మాన్ నటించిన దబాంగ్-3 చిత్రం విడుదలకు సిద్దమౌతుండగా, ఇన్షా అల్లా అనే చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.