RBI 1 rupee note : 1 రూపీ నోటుపై RBI అనే ముద్ర ఉండదు... ఎందుకంటే?

డబ్బు అవసరం లేనివారు ఈ భూప్రపంచంలో ఉండనే వుండరు.మన ఇండియన్ కరెన్సీ రుపీకి ఓ ప్రత్యేకమైన హిస్టరీ వుంది.

 1 రూపీ నోటుపై Rbi అనే ముద్ర ఉండదు&-TeluguStop.com

డబ్బును కరెన్సీ నోట్ల రూపంలో వాడుతూ ఉంటాం.ఎందుకంటే నిర్దిష్ట నోటుపై వాగ్దానం చేసిన సంతకం ఉండటం వల్ల దానికి విలువ ఉంటుంది.

అతి చిన్న విలువైన రూపాయి నోటు దగ్గర నుంచి 2 వేల నోటు వరకు మనదేశంలో చాలా నోట్లు మార్కెట్‌లో చలామణిలో వున్నాయి.అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, ఒక్క రూపాయి నోటు మినహా మిగతా అన్ని నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం ఉంటుంది.

ఇది మీరు గమనించారా? ప్రస్తుతం మన దేశంలో భారతీయ కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోందన్న విషయం తెలిసినదే.మెటల్ నాణేలు లేదా కాగితం నోట్లు అయినా వాటన్నింటినీ RBIనే జారీ చేస్తుంది.

అన్ని భారతీయ కరెన్సీ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని వ్రాయబడింది.ఆ నోటును జారీ చేసే గవర్నర్ సంతకం కూడా ఉంది.కానీ, మీరు 1 రూపాయి నోటును జాగ్రత్తగా పరిశీలిస్తే.దానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని వ్రాసి ఉండదు.

ఈ నోటు ఇతర నోట్ల కంటే భిన్నంగా ఉండడానికి కారణం ఏంటో ఒక్కసారి చూద్దాము.

Telugu Ripper, Key, Latest-Latest News - Telugu

ఈ నోటు దేశంలోని మిగిలిన కరెన్సీ నోట్ల కంటే కాస్త భిన్నంగా ఉంది.మీరు 1 రూపాయి నోటును జాగ్రత్తగా పరిశీలిస్తే దానిపై RBI గవర్నర్ సంతకం లేదా భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని వ్రాసి ఉండదు.భారతదేశంలో ఒక రూపాయి నోటు ఆపరేషన్ 30 నవంబర్ 1917 నుంచి ఆరంభం అయింది.

బ్రిటిష్ పాలనలో వున్నపుడు ఈ నోటుపై భారతదేశ చక్రవర్తి జార్జ్ V ఫోటోను ముద్రించారు.ఆ తర్వాత 1926లో 1 రూపాయి నోటు ముద్రణ ఆగిపోయి, 14 ఏళ్ల తర్వాత 1940లో మరోసారి 1 రూపాయి నోటు ముద్రణ జరిగింది.కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో 1935 సంవత్సరంలో స్థాపించబడింది.1 రూపాయి నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేయలేదని దీన్ని బట్టి స్పష్టమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube