ఇక పాక్ గగనతలం లోకి భారత విమానాలు!  

Pakistan Reopens Airspace For Civil Aviation-

ఇక పై పొరుగుదేశం పాకిస్థాన్ గగనతలం మీదుగా భారత విమానాలు వెళ్లొచ్చట.ఈ మేరకు తమ గగనతలం పై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు పాక్ మంగళవారం వేకువ జామున తెలిపింది.ఈ ఆంక్షలను ఎత్తివేయడం తో ఇక పాక్ గగనతలం పై భారత్ తో పాటు పలు దేశాలకు చెందిన పౌర విమానాలు ప్రయాణించనున్నట్లు పాక్ పౌర విమానయాన సంస్థ ఒక ప్రకటనను విడుదల చేసింది...

Pakistan Reopens Airspace For Civil Aviation--Pakistan Reopens Airspace For Civil Aviation-

ఫిబ్రవరిలో బాలాకోట్‌ దాడుల తర్వాత రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.పాక్‌ తమ గగనతలాన్ని మూసివేసింది.దాదాపు అయిదు నెలల తరవాత పాక్‌ ఆంక్షల్ని ఎత్తివేయడం గమనార్హం.

పాక్‌ నిర్ణయం భారత విమానయాన సంస్థలకు కూడా ఊరటనిచ్చే విషయం.గతంలో కూడా ప్రధాని విదేశీ పర్యటన నిమిత్తం పాక్ గగనతలం మీదుగా వెళ్లాల్సి ఉండగా,దానిని రద్దు చేసుకొని వేరే మార్గం ద్వారా తన విదేశీ పర్యటనను ముగించుకున్న విషయం తెలిసిందే.అయితే ఉన్నట్టుండి పాక్ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంది అన్న దానిపై మాత్రం కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి..

Pakistan Reopens Airspace For Civil Aviation--Pakistan Reopens Airspace For Civil Aviation-

పాక్ విధించిన ఈ ఆంక్షల నేపథ్యంలో భారత విమానయాన సంస్థలకే కాకుండా పాక్ కూడా భారీ గా నష్టపోయినట్లు సమాచారం.అయితే ఇటీవలే సరిహద్దు సమీపాన ఉన్న వైమానిక స్థావరాల నుంచి భారత్‌ మోహరించిన అన్ని విమనాలను వెనక్కి తీసుకునేంత వరకు ఆంక్షల్ని ఎత్తివేసేది లేదని ఖచ్చితంగా చెప్పిన పాక్ కొద్దీ రోజుల్లోనే ఆంక్షలను ఎత్తివేస్తూ తీసుకోవడం విశేషం.అయితే పాక్ నిర్ణయం పై స్పందించిన భారత్‌ ఇరు దేశాల మధ్య అన్ని మార్గాల్లో విమానయాన ఆపరేషన్లు పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.