రాజు గారి గదిలోకి ఇంకెంతమంది అందెగత్తెలు కావాలి బాసూ?  

Omkar New Movie Raju Gari Gadhi 3-

బుల్లి తెరను షేక్‌ చేసిన యాంకర్‌ ఓంకార్‌ వెండి తెరపై కూడా వరుసగా ప్రయత్నాలు చేస్తున్నాడు.ఈయన చేసిన హర్రర్‌ మూవీ రాజు గారి గదికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.ఆ చిత్రం తర్వాత రాజు గారి గది 2 అంటూ తెరకెక్కించాడు.రెండవ పార్ట్‌లో నాగార్జున మరియు సమంత వంటి స్టార్స్‌ ఉన్నా కూడా ప్రయోజనం లేదు...

Omkar New Movie Raju Gari Gadhi 3--Omkar New Movie Raju Gari Gadhi 3-

ఆ మూవీ ఫ్లాప్‌ అయ్యింది.ఆ తర్వాత మూడవ పార్ట్‌ను మొదలు పెట్టాడు.అయితే మొదట తమన్నాను అనుకుంటే ఆమె తప్పుకుంది.

తన పాత్ర గురించి పూర్తి క్లారిటీ ఇచ్చిన తర్వాత బాబోయ్‌ తన వల్ల కాదంటూ తప్పుకుంది.

Omkar New Movie Raju Gari Gadhi 3--Omkar New Movie Raju Gari Gadhi 3-

తమన్నా తప్పుకోవడంతో పలువురు హీరోయిన్స్‌ను సంప్రదించాడు.అయితే చివరకు ఈయన అవికా గౌర్‌ మరియు తాప్సిలను ఫైన్‌ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.వీరిద్దరు కూడా సినిమాకు అందం తీసుకు వస్తారని ఓంకార్‌ భావిస్తున్నాడట.

ఇదే సమయంలో వీరిద్దరితో పాటు కథానుసారంగా మరో హీరోయిన్‌ కూడా అవసరం ఉందని, ఆ మూడవ హీరోయిన్‌ పాత్ర కోసం ముద్దుగుమ్మ రష్మి గౌతమ్‌ను సంప్రదించాడని తెలుస్తోంది...

ఇప్పటికే పలు సినిమాల్లో నటించి మెప్పించిన రష్మి ఇప్పుడు ఈ చిత్రంలో మూడవ హీరోయిన్‌గా ఎంపిక కావడం పెద్దగా ఆశ్చర్యంగా ఏమీ అనిపించడం లేదు.కాకపోతే ఒక్క సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు ఎందుకు ఓంకార్‌ అంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు.ముద్దుగుమ్మలతో ఓంకార్‌ ఏ స్థాయిలో భయపెడతాడో చూడాలి.

మొదటి పార్ట్‌ తరహాలో మూడవ పార్ట్‌ను పూర్తి ఎంటర్‌ టైనర్‌గా రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కాబోతుంది...