కాంగ్రెస్ పార్టీకి కొత్త సారధి తలనొప్పి! బలమైన నాయకుడు కోసం దృష్టి  

No Consensus Decision On Rahul Gandhi\'s Replacement As Congress-

తాజాగా జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత పార్టీకి సారధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీలో అంతర్మధనం మొదలైంది.ప్రజలు తన నాయకత్వం అంగీకరించలేదు అని అర్ధం చేసుకున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సారధ్య బాద్యతల నుంచి తప్పుకున్నాడు.అయితే ఈ విషయంలో ఎవరు ఎన్ని విధాలుగా నచ్చచెప్పి కాంగ్రెస్ సారధ్య బాద్యతలు తిరిగి చేపట్టాలని చెప్పిన కూడా రాహుల్ మాత్రం కుదరదంటే కుదరదు అని స్పష్టం చేసేసాడు...

No Consensus Decision On Rahul Gandhi\'s Replacement As Congress--No Consensus Decision On Rahul Gandhi's Replacement As Congress-

ఇక అధినేత్రి సోనియా కూడా కొడుకుని ఒప్పించే ప్రయత్నం చేసిన కూడా వద్దని చెప్పేసాడు.

దీంతో కాంగ్రెస్ కొత్త సారధి కోసం పార్టీ అధిష్టానం ద్రుష్టి పెట్టింది.మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి నడిపించాలంటే కేవలం కాంగ్రెస్ నేత అయితే సరిపోదు కచ్చితంగా మోడీ లాంటి బలమైన నాయకుడుతో తలపడే సామర్ధ్యం ఉన్న వ్యక్తి అయ్యి ఉండాలి.

No Consensus Decision On Rahul Gandhi\'s Replacement As Congress--No Consensus Decision On Rahul Gandhi's Replacement As Congress-

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదే విషయం ఆలోచిస్తే కాంగ్రెస్ సారధి ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తుంది.కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి విషయంలో పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కొత్త సారధి ఎంపిక మరింత ఆలస్యం అవుతుంది.పార్లమెంటు సమావేశాలు కొనసాగడం వలన కూడా కాంగ్రెస్ సారథి ఎంపిక ప్రక్రియ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 22 తర్వాతే సారధి విషయంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.