బీజేపీలోకి రండి ! ఈ ఆఫర్లు తీసుకోండి

ఏపీ లో వేగంగా పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్న బీజేపీ అందుకు తగ్గట్టుగానే వివాద పార్టీల్లోని నాయకులను చేర్చుకుని వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థాయిలో సీట్లు సాధించాలని చూస్తున్నారు.అందుకే టార్గెట్ పెట్టుకుని మరీ నాయకులను చేర్చుకునే పనిలో పడ్డారు.

 1 Kannalaxminarayana Givethe Offersto Joinin Bjp-TeluguStop.com

ఇప్పటికే ఇతర పార్టీల్లోనో అసంతృప్తులను గుర్తించిన బీజేపీ వారిని పార్టీలో చేర్చుకోవడంతో పాటు ఇంకా మిగిలి ఉన్న బలమైన నాయకులను చేర్చుకునేందుకు వారికి ఆఫర్లు కూడా ఇస్తూ పార్టీ లో చేరాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.దీనిలో భాగంగానే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముందుకు వెళ్లడం అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

పార్టీలతో సంబంధం లేదు నాయకులతోనే సంబంధం అన్నట్టుగా బీజేపీ నాయకులు ముందుకు దూసుకు పోతున్నారు.

-Telugu Political News

ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఉన్న ఓటమి చెందిన టీడీపీ నాయకులను తమ పార్టీలో చేరాల్సిందిగా పదే పదే ఒత్తిడి చేస్తూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు.మీరు మా పార్టీలో చేరితే కేసులు లేకుండా చేస్తాం, కేంద్రంతో మంచి సంబంధాలు ఉండేలా చేస్తాం, అంతే కాదు మీ వ్యాపారాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తాం అంటూ వారికి ఆఫర్లు ఇస్తున్నారట.ఇటీవల కాలంలో టీడీపీని వదిలి బీజేపీలోకి వెళ్లిన వారంతా ఇటువంటి హామీలతోనే వచ్చి చేరారని మిగతా వారికి చెబుతూ వారు పార్టీలోకి వచ్చేలా కన్నా లక్ష్మీనారాయణ పావులు కడుపుతున్నాడట.

ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి ఇక భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు శున్యం అని చెబుతూ భయపెట్టే ప్రయత్నం కూడా కన్నా చేస్తున్నారట.

వచ్చే ఎన్నికల నాటికి కూడా టీడీపీ ఎదిగేదిలేదని, ఆ పార్టీలో ఉన్నవారంతా ఏదో ఒక రోజు బీజేపీలో చేరుకోవడం ఖాయమని కన్నా లక్ష్మీనారాయణ చెబుతున్నారట.

దీనికి నమ్మకం కలిగేలా ఆయన ప్రస్తుతం జగన్ పరిపాలన చూపిస్తున్నారట.త్వరలోనే చంద్రబాబు జైలుకు పంపించేందుకు జగన్ అన్ని సాక్ష్యాలు సంపాదించారని, ఇక లోకేష్ కు పార్టీని సమర్థవంతంగా పార్టీని నడిపించే సామర్ధ్యం లేదని చెబుతున్నారట.

ముఖ్యంగా కన్నా సొంత జిల్లా అయిన గుంటూరు జిల్లా నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడట.జిల్లాలోని నరసరావుపేటకు చెందిన డాక్టర్ చదలవాడ అరవిందబాబు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు.

ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు.ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్లడం దాదాపు ఫిక్స్ అయ్యింది.

ఈయనతో పాటు ఇదే జిల్లాకు చెందిన టీడీపీ నేతలు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు మరో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube