కేంద్ర మంత్రిని బెదిరించిన వ్యక్తి ని అరెస్ట్ చేసిన పోలీసులు

కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కిషన్ రెడ్డి కి ఆ మధ్య బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే.గత కొద్దీ సంవత్సరాలుగా కిషన్ రెడ్డికి ఒక వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కిషన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడం తో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరకు అతడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

 1 Hyderabadpolicehas Arresteda Personfor Threateningunionminister Ofstate-TeluguStop.com

కడప జిల్లాకు చెందిన షేక్ ఇస్మాయిల్ గా అతడిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.అయితే ఇస్మాయిల్ తెలివిగా ఇంటర్నెట్ వాయిస్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

కిషన్ రెడ్డి గత ఎన్నికల్లో విజయాన్ని అందుకొని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా భాద్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.అయితే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా ఇస్మాయిల్ కిషన్ రెడ్డి కి బెదిరింపు కాల్స్ చేశాడని, ఈ క్రమంలోనే కేంద్ర సహాయ మంత్రిగా నియమితులు అయిన తరువాత కూడా బెదిరింపు కాల్స్ రావడం తో కిషన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనితో ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకొని రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి కడప జిల్లాకు చెందిన ఇస్మాయిల్ ని అరెస్ట్ చేశారు.అయితే ఇస్మాయిల్ కువైట్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పని చేసి తిరిగి వచ్చి ప్రస్తుతం కడప జిల్లాలో నివసిస్తున్నట్టుగా సమాచారం.

మరోవైపు కేంద్ర మంత్రి అయిన తర్వాత కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ రావడంతో సీరియస్‌గా తీసుకున్న పోలీసులు స్కెచ్ వేసి పట్టుకున్నట్టు సమచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube