సందీప్ సినిమా కూడా రీమేక్ కు సిద్ధమైపోయింది  

Hindi Remake Rights Of Ninu Veedani Needanu Nene-

మరో టాలీవుడ్ మూవీ రీమేక్ కి సిద్దమైనట్లు తెలుస్తుంది.ఒకప్పుడు రీమేక్ అంటే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో తీయడం అనేదే ఉండేడి.కానీ ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి అలా లేదు...

Hindi Remake Rights Of Ninu Veedani Needanu Nene--Hindi Remake Rights Of Ninu Veedani Needanu Nene-

బాహుబలి ముందు బాహుబలి తరువాత అన్నట్లు గా తయారైంది.బాహుబలి అనే చిత్రం ఒక్క బాలీవుడ్ నే కాదు ప్రపంచం మొత్తాన్ని కూడా టాలీవుడ్ వైపు చూసేలా చేసింది.ఎక్కడో రేర్ గా టాలీవుడ్ మూవీ లు రీమేక్ కు నోచుకుంటుండగా, ఇప్పుడు దాదాపు చాలా సినిమాలు రీమేక్ కు సిద్దమౌతున్నాయి.

Hindi Remake Rights Of Ninu Veedani Needanu Nene--Hindi Remake Rights Of Ninu Veedani Needanu Nene-

అయితే ఇప్పుడు తాజాగా ఈ రీమేక్ ల లిస్ట్ లో సందీప్ కిషన్ తాజా మూవీ నిలిచింది.నిను వీడని నీడను నేనే అనే చిత్రం సందీప్ కిషన్ నిర్మించి నటించగా ఇటీవల విడుదలై సక్సెస్ టాక్ ని అందుకుంది.అయితే ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు హిందీ మేకర్స్ ముందుకొచ్చినట్లు సందీప్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.‘ స్త్రీ నిర్మాత‌లు, షోర్ ఇన్ ది సిటీ ద‌ర్శ‌కులు రాజ్‌, డీకేలు.

వారు నా మార్గదర్శకులు, సోదరులు .నా సినిమా రీమేక్‌ రైట్స్ వారు తీసుకున్నారు.నా సినిమా మంచి చేతుల్లో పడినందుకు ఆనందంగా ఉంది’ అని సందీప్ త‌న ట్వీట్ లో తెలిపాడు..

ఐదేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్‌కిషన్ ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.అయితే తొలిసారి తన కెరీర్ లోనే థ్రిల్లర్ జోనర్‌ని ఎంచుకున్న సందీప్ తన మిత్రులతో కలిసి ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మాణ భాద్యతలు కూడా తీసుకున్నాడు.కొత్త దర్శకుడు కార్తిక్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఇటీవల ధియేటర్ల లో విడుదల అయ్యింది.తాజాగా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు ఈ సినిమాని వేరే భాష‌ల‌లో రీమేక్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌ల‌వుతున్నట్లు తెలుస్తుంది.