బిగ్ బాస్-3 షో లో ఆ క్రేజీ హీరోయిన్ కూడానా!  

Hebba Patel In Big Boss Show-

బిగ్ బాస్-3 ఏ మూహూర్తాన మొదలు పెట్టారో గాని ఇప్పటివరకు కూడా ఆ షో లో పాల్గొన బోయే పార్టిసిపెంట్స్ పై ఎలాంటి సమాచారం మాత్రం బయటకు రావడం లేదు.అతి త్వరలో రాబోయే ఈ ప్రోగ్రాం కోసం ఇప్పటికే తెలంగాణా తీన్మార్ పిల్ల సావిత్రి,హాట్ యాంకర్ శ్రీముఖి అలానే లాస్య ఇలా పలువురు పేర్లు బయటకు వచ్చాయి.అయితే ఆ వార్తల్లో వీలైతే శ్రీముఖి ఒక్కతే ఈ షో లో పాల్గొనబోతున్నట్లు అర్ధం అవుతుంది.

Hebba Patel In Big Boss Show--Hebba Patel In Big Boss Show-

ఎందుకంటే ఇటీవల శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ పెట్టడం దానిలో ఈ అమ్మడు కొంత చిక్కి పోయి కనిపించడం తో ఇప్పుడు అందరూ కూడా బిగ్ బాస్-3 లో శ్రీముఖి ఉందని కన్ఫార్మ్ చేసుకుంటున్నారు.అయితే ఇప్పుడు ఈ హాట్ యాంకర్ కు పోటీ గా టాలీవుడ్ లో హాట్ బ్యూటీ గా, గ్లామర్ డాల్ గా గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్ కూడా ఈ షో ద్వారా సందడి చేయనున్నట్లు తెలుస్తుంది.అయితే తాజాగా బిగ్ బాస్ 3 పార్టిసిపెంట్ లిస్ట్ లో హెబ్బా పటేల్ పేరు వినిపిస్తుండటంతో అందం, అట్రాక్షన్ పరంగా హాట్ యాంకర్ శ్రీముఖికి హెబ్బాపటేల్ పోటీగా నిలుస్తుందనే పెద్ద టాక్ వినిపిస్తుంది.

ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు హెబ్బాపటేల్ తో సంప్రదింపులు కూడా చేశారని సమాచారం.ఇక ఒకే షో లో శ్రీముఖి లాంటి హాట్ యాంకర్,అలానే హెబ్బా పటేల్ లాంటి గ్లామర్ డాల్ కనిపిస్తే ఇక బుల్లితెర ప్రేక్షకులు ఊరుకుంటారా.

పండగే పండగ చేసుకోరు.యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హెబ్బా బుల్లి తెరపై కనిపిస్తుంది అన్న మాటే యూత్ లో ఒక మంచి హుషారు నింపే అవకాశం ఉంటుంది.మొత్తానికి ఈ సారి బిగ్ బాస్ షో లో పార్టిసిపెంట్స్ విషయంలో టీమ్ బాగా కసరత్తులు చేస్తుంది అన్న విషయం అయితే అర్ధం అవుతుంది.