బిగ్ బాస్ పై మరో ఫిర్యాదు,ఈసారి ఎవరంటే  

Gayatri Gupta Comments On Big Boss Show-

‘బిగ్ బాస్’ రియాల్టీ షో ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.ఆ షో ద్వారా వచ్చిన నటులను ఇప్పుడు ఎవరైనా ఈజీ గా గుర్తుపట్టేస్తారు.అలాంటి బిగ్ బాస్ షో రెండు సీజన్స్ ను పూర్తి చేసుకొని ఇప్పుడు మూడో సీజన్ ప్రారంభమౌతున్న సంగతి తెలిసిందే.

Gayatri Gupta Comments On Big Boss Show- Telugu Viral News Gayatri Gupta Comments On Big Boss Show--Gayatri Gupta Comments On Big Boss Show-

అయితే మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఈ బిగ్ బాస్ షో ఈసారి వివాదాలకు నెలవైపోయింది.ఒక వేళ ఇదోరకం పబ్లిసిటీ నా లేదంటే నిజంగా వివాదాల మయమా అన్న విషయం అర్ధం కావడం లేదు కానీ మొన్నటికి మొన్న షో నిర్వాహకుల పై యాంకర్ శ్వేతా రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Gayatri Gupta Comments On Big Boss Show- Telugu Viral News Gayatri Gupta Comments On Big Boss Show--Gayatri Gupta Comments On Big Boss Show-

ఇదే పెద్ద వివాదంగా మారగా ఇప్పుడు తాజాగా నటి గాయత్రీ గుప్తా కూడా పోలీసులకు బిగ్ బాస్ షో పై ఫిర్యాదు చేసింది.ఈ బిగ్ బాస్ షో లో సెలక్ట్ అయ్యాను అని చెప్పిన కారణంగా ఆరు సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా వదులుకున్నాను అని,తీరా అంతా సిద్ధం అనుకున్నాక మీరు సెలక్ట్ కాలేదు అంటూ ఫోన్ చేసి చెప్పారని ఈ మేరకు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.

బిగ్‌బాస్‌ షోకి రావడానికి సిద్ధమేనా అని రఘు అడిగాడని, వంద రోజులపాటు హౌస్‌లోనే ఉండాల్సి వస్తుందని అన్నారు.అంతేకాకుండా ముంబై నుంచి అభిషేక్,రఘు,రవికాంత్ లు వచ్చి మరి అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారని, ఈ క్రమంలోనే వేరే ప్రాజెక్టులు ఏవీ కూడా ఒప్పుకోవద్దని చెప్పినట్లు తెలిపింది.

అయితే ఈ సందర్భంగా బిగ్‌బాస్‌లోకి వెళ్లాలంటే పైవారిని ఎలా సంతృప్తి పరుస్తారని రఘు అడిగారని, అలా ఎందుకని నేను ఘాటుగా కూడా ప్రశ్నించాను, అయితే ఆ తరువాత నాకు ఒక రోజు ఫోన్ చేసి ఈ షో కి మీరు ఎంపిక కాలేదు అంటూ తెలిపారని ఫిర్యాదులో పేర్కొంది.అయితే తనకు జరిగిన నష్టం కి నష్టపరిహారం చెల్లించాలని షో నిర్వాహకులను కోరినప్పటికీ వారు స్పందించకపోవడం తో చివరికి పోలీసులను గాయత్రీ ఆశ్రయించినట్లు తెలుస్తుంది.మొత్తానికి బిగ్ బాస్ ఈ సీజన్ మాత్రం మంచి వివాదాలకు నెలవైపోయింది అన్నమాట.