మిస్ట్రరీ : దెయ్యం చేసిన హత్య, ఏడు ఏళ్లు అయినా కేసును ఛేదించలేక పోయిన పోలీసులు  

ఈ ప్రపంచంలో కొన్ని మిస్ట్రరీలకు సమాధానం ఎంత వెదికినా కనిపించదు.అసలు మిస్ట్రరీ అంటేనే సమాధానం లేని ప్రశ్నలు.

TeluguStop.com - 1 Elisa Lam In Canada Hotel

ఎన్నో మిస్ట్రరీలు హిస్ట్రరీలో ఉన్నాయి.కాని ఏ ఒక్కదారిని సమాధానం లభించడం లేదు.

ఎన్నో మిస్ట్రరీలు ఉన్నా కూడా కొన్ని మిస్ట్రరీలు మాత్రం అత్యంత భయానకంగా అత్యంత దారుణంగా ఉంటాయి.అసలు అలా జరిగింది అంటే ఇప్పుడు ఎవరు నమ్మరు.

ఇప్పుడు నేను చెప్పబోతున్న సంఘటన 2013వ సంవత్సరంలో జరిగింది.ఎలిసా లామ్‌ అనే యువతి ప్రముఖ హోటల్‌లో రూం తీసుకుని అందులో ఉంది.

ఏం జరిగిందో ఏమో కాని ఆమె వాటర్‌ టాక్‌ లో దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఆమె ఆత్మహత్యకు ముందు జరిగిన పరిణామాలు చూస్తుంటే చాలా వింతగా అనిపిస్తుంది.ఆమె చనిపోవడానికి ముందు ప్రవర్తించిన తీరు సీసీ టీవీలో రికార్డు అయ్యింది.ఆమె ఎవరినో చూసి భయపడ్డట్లుగా ఆ సీసీ టీవీలో రికార్డు అయ్యింది.

కాని అసలు విషయం ఏంటీ అంటే సీసీ టీవీలో ఆమె తప్ప మరెవ్వరు రికార్డు కాలేదు.ఆమె చాలా సమయం పాటు సీసీ టీవీ ముందు ఎవరితోనో మాట్లాడటంతో పాటు లిఫ్ట్‌లో వింత వింతగా ప్రవర్తించింది.

ఎవరో తరుముతుంటే భయపడి వచ్చినట్లుగా ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది.ఆమె పరిగెత్తడం సీసీ టీవీలో రికార్డ్‌ అయ్యింది.కాని ఆమె వెనుక ఉన్న వారు ఎవరు కూడా కనిపించలేదు.

ఇక లిఫ్ట్‌లోకి వెళ్లిన తర్వాత ఆమె అన్ని ఫ్లోర్స్‌కు సంబంధించిన బటన్స్‌ వత్తేసింది.అయితే లిఫ్ట్‌ వెంటనే డోర్‌ క్లోజ్‌ అవ్వాలి.కాని ఆమె భయపడి దాచుకున్నా కూడా డోర్‌ వద్ద ఎవరో ఉన్నారు అన్నట్లుగా ఆ డోర్‌ అలాగే క్లోజ్‌ కాకుండా ఉంది.

కొద్ది సమయం తర్వాత ఆమె లిఫ్ట్‌ నుండి బయటకు వెళ్లింది.అప్పుడు కూడా కొద్ది సమయం లిఫ్ట్‌ డోర్‌ క్లోజ్‌ కాలేదు.లిఫ్ట్‌ ముందు ఆమె ఏదో సీరియస్‌గా చాలా సేపు మాట్లాడినట్లుగా అనిపించింది.కాని ఎవరితో అనే విషయమై క్లారిటీ లేదు.

లిఫ్ట్‌ నుండి బయటకు వెళ్లిన తర్వాత ఆమె పైకి వెళ్లి వాటర్‌ ట్యాంక్‌లో దూకుంది.అయితే హోటల్‌ సిబ్బంది చెబుతున్నదాని ప్రకారం ఇతరులకు ఎవరికి వాటర్‌ ట్యాంక్‌ మూత తీసే అనుమతి లేదు.ఒక వేళ ఎవరైనా వాటర్‌ ట్యాంకర్‌ మూత తీసేందుకు ప్రయత్నిస్తే హోటల్‌ మొత్తం అలారం మొగుతుంది.కాని ఎలిసా మూత తీసిన సమయంలో అలారం మోగలేదు.అసలు ఎలిసా ఎవరిని చూసి భయపడింది, లిఫ్ట్‌ డోర్‌ అంత సమయం ఎందుకు ఓపెన్‌లోనే ఉంది, వాటర్‌ ట్యాంక్‌ అలారం ఎందుకు మోగలేదు.ఇవన్నీ మిస్ట్రరీలుగానే ఉన్నాయి.

వీటికి గత ఆరు ఏడు సంవత్సరాలుగా సమాధానాల కోసం అన్వేషిస్తున్నారు.

#LiftButtuns #TeluguGeneral #Elisa Lam #MysteryBehind #BeforeDeath

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు