భారతీయుడు.కమల్ హాసన్ హీరోగా గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ తెరక్కించిన మూవీ.ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.సౌత్ లో ఓరేంజి వసూళ్లు సాధించింది.హీరోగా కమల్ హాసన్ కి, దర్శకుడిగా శంకర్ కు ఎనలేని పేరు తెచ్చింది.సుబాష్ చంద్రబోస్ బ్రతికుంటే దేశంలో జరుగుతున్న అవినీతి చూసి ఎలా రియాక్ట్ అవుతాడు అనే లైన్ తో తెరకెక్కించిన సినిమా భారతీయుడు.
ఈ స్టోరీ వినగానే కమల్ ఓకే చెప్పాడు.శంకర్, కమల్ కాంబినేషన్లో.ఏఎం రత్నం నిర్మాతగా రూ.12 కోట్ల బడ్జెట్ తో మూవీ ప్రకటన చేశారు.సౌత్ లో అప్పటి వరకు అంత మొత్తంతో ఏ సినిమా తెరకెక్కలేదు.
కమల్ హాసన్ డ్యుయల్ రోల్ చేయకపోతే కొడుకు పాత్రకి అజిత్ ని తీసుకోవాలి అనుకున్నారు.
కానీ కమల్ 2 పాత్రలు చేయడానికి ఒకే చెప్పారు.సీనియర్ కమల్ సరసన రాధికని ఓకే చేయాలి అనుకున్నారు.
డేట్స్ కుదరక ఆమె నో చెప్పారు.దాంతో సుకన్యని ఫైనల్ చేశారు.
ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఐశ్వర్య రాయ్, శిల్పాశెట్టి ని తీసుకోవాలని భావించారు.ఐశ్వర్యకి యాడ్ ఏజెన్సీతో అగ్రిమెంట్ కారణంగా నటించలేనని చెప్పింది.
అప్పుడు మనీషా కొయిరాలాని ఎంపిక చేశారు.మరో నటిగ ఊర్మిళ ఓకే అయ్యింది.సంగీత దర్శకుడిగా ఏ ఆర్ రెహమాన్ ని ఫిక్స్ చేశారు.
1995 లో షూటింగ్ మొదలైంది.ఈ సినిమాలో కమల్ మేకప్ వేయడానికి ఏకంగా 5 గంటల సమయం పట్టిందట.తీయడానికి 2 గంటలు పట్టేదట.అంతేకాదు.కేవలం కమల్ మేకప్ కోసమే 1 కోటి రూపాయలు పెట్టి అమెరికా నుంచి కొంత మందిని అమెరికా నుంచి తీసుకొచ్చారట.
షూటింగ్ మొత్తం ప్రసాద్ స్టూడియోస్, వాహిని స్టూడియోస్, ముంబైలో మరికొంత కంప్లీట్ అయ్యింది.టెలిఫోన్ ధ్వనిలా అనే పాటను ఆస్ట్రేలియాలో తెరకెక్కించారు.
ఫస్ట్ టైం ఫారెన్ లో తీసిన ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం.షూటింగ్ మొత్తం 150 రోజుల్లో కంప్లీట్ చేశారు.
భారతీయుడు ఆడియో 1996 ఏప్రిల్ లో రిలీజ్ చేశారు.అన్ని భాషల్లో పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
ఈ సినిమాకి రెహమాన్ కి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది.అప్పటి వరకు రిలీజ్ అయిన డబ్బింగ్ సినిమాల్లో ఇదే టాప్ గా నిలిచింది.60 కోట్లు వసూలు చేసి రికార్డు సాధించింది.ఈ సినిమాకు 3 జాతీయ అవార్డుల వచ్చాయి.