సంక్షోభానికి చెక్ పెట్టిన సుప్రీం కోర్టు!  

Court Can T Tell Speaker To Decide On Resignation In Time Bound Manner-

కర్ణాటక లో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టినట్లు తెలుస్తుంది.రెబెల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలు స్పీకర్ ఆమోదించడం లేదంటూ సుప్రీం కోర్టు ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన సుప్రీం న్యాయస్థానం రాజీనామాల విషయంలో తుది నిర్ణయం స్పీకర్ కే ఉంటుంది అని స్పష్టం చేయడం తో పాటు నిర్ణయం తీసుకోవడానికి టైమ్ లిమిట్ అనేది కూడా స్పీకర్ కు లేదని అత్యున్నత న్యాస్థానం స్పష్టం చేసింది.మా రాజీనామాలను స్పీకర్ రమేష్ కుమార్ ఆమోదించేలా ఆదేశించాలని కాంగ్రెస్, జేడీఎస్ నుంచీ 15 మంది రెబల్ ఎమ్మెల్యేలు కోరుతున్న సంగతి తెలిసిందే.అయితే వారి రాజీనామా లేఖలు సరైన ఫార్మాట్‌లో ఇవ్వలేదనీ, కాబట్టి స్పీకర్‌ వాటిపై నిర్ణయం తీసుకోకుండా యదాతథ స్థితి కొనసాగించాలంటూ మరోపక్క కర్ణాటక ప్రభుత్వం కోరింది.

Court Can T Tell Speaker To Decide On Resignation In Time Bound Manner- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage-Court Can T Tell Speaker To Decide On Resignation In Time Bound Manner-

ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అధ్యక్షతన, న్యాయమూర్తులు దీపక్ గుప్తా, అనిరుద్ధ బోస్ సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇవాళ తీర్పు ఇచ్చింది.అంతేకాకుండా ఈ నెల 18 న సీఎం కుమార స్వామి బలపరీక్షకు సిద్ధమని ప్రకటించిన సంగతితెలిసిందే.

Court Can T Tell Speaker To Decide On Resignation In Time Bound Manner- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage-Court Can T Tell Speaker To Decide On Resignation In Time Bound Manner-

ఐతే బలపరీక్షలో కూడా ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని కాకపోతే బలవంతం మాత్రం చేయకూడదు అని కోర్టు తెలిపింది.దీనితో గురువారం జరగబోయే బలపరీక్ష లో పాల్గొనాలో లేదో అన్నది రెబల్ ఎమ్మెల్యేలే స్వయంగా నిర్ణయం తీసుకుంటారు.అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం సుప్రీంకోర్టుకు వెళ్లటం ప్రభుత్వం, రెబల్ ఎమ్మెల్యేలు వాదనలు వినిపించడంతో సుప్రీంకోర్టు తాజాగా చెప్పిన తీర్పు సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా మారింది.