టిఆర్ఎస్ పై బీజేపీ ఫోకస్ ? దూకుడు స్టార్ట్ అయ్యిందా ?  

Bjp Plan To Move In Ts -

కేంద్ర అధికార పార్టీ బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ బలపడేందుకు చూస్తోంది.కేంద్రంలో ఎలాగూ అధికారంలో ఉండడంతో పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి బలపడేందుకు ప్రయత్నిస్తోంది.

Bjp Plan To Move In Ts

ఆ విధంగానే ఏపీ, తెలంగాణల్లో రాజకీయ చక్రం తిప్పుతోంది.ముఖ్యంగా తెలంగాణ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాస్త ఆశాజనకంగానే సీట్లు, ఓట్లు పడడంతో ఇక్కడ కాస్త గట్టిగా కష్టపడితే వచ్చే ఎన్నికలనాటికి అధికారం చేజిక్కించుకోవడం పెద్ద కష్టమేమి కాదనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ పై ముప్పేట దాడి చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి.ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది.

ఈ మధ్యకాలంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టిన అంశం ఏదైనా ఉందా అంటే అది ఇంటర్ బోర్డు వ్యవహారం.అక్కడ తలెత్తిన పరిస్థితుల కారణంగా జరిగిన ఆత్మహత్యలు ప్రభుత్వం మీద, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి.అయితే ఆ సమస్యను మీడియా మరింత పెద్దదిగా చేయకుండా చేయడం లో టిఆర్ఎస్ సక్సెస్ అయినప్పటికీ బిజెపి మాత్రం ఈ సమస్యను అంత తేలిక గా వదలకూడదు అన్నట్లుగా ఉంది.మొన్నా మధ్య ఈ సమస్యపై అమిత్ షా నివేదిక తెప్పించుకోవడానికి ప్రయత్నించగా ఇప్పుడు ఈ సమస్యను పార్లమెంటులో కూడా ఎత్తిచూపారు.

అదేవిధంగా అటవీశాఖ అధికారి పై టీఆర్ఎస్ నేతలు దాడి చేసిన అంశం పై కూడా పార్లమెంటులో ప్రస్తావించారు.దీంతో టీఆర్ఎస్ వైపు నుండి ఏ చిన్న పొరపాటు జరిగినా, టిఆర్ఎస్ పార్టీని తీవ్ర ఇరకాటంలో పెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని అర్ధం అయిపోతోంది.

అంతే కాకుండా అన్ని పార్టీల నుంచి చోట మోట నాయకులని పార్టీలో చేర్చుకుంటూ ముందుకు వెళ్తోంది.ప్రస్తుతం బీజేపీ అనుసరిస్తున్న కవ్వింపు చర్యలు టీఆర్ఎస్ కు ఆగ్రహం తెప్పిస్తున్న పెద్దగా ఆ పార్టీని విమర్శించే ధైర్యం చేయలేకపోతున్నారు.తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ బలం పెద్దగా లేదు.కేవలం ఒకే ఒక్క ఎమ్యెల్యే మాత్రమే ఉన్నారు.అందుకే బీజేపీని టార్గెట్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని టీఆర్ఎస్ భావిస్తోంది.ఒకే ఒక్క ఎమ్మెల్యే కలిగిన ఈ పార్టీపై అసహనాన్ని నేరుగా వ్యక్తం చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే భయం కూడా టిఆర్ఎస్ పెద్దల లో కనిపిస్తోంది.

దీంతో నేరుగా ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్న ట్టు గా ఎదుర్కొనలేక, అలాగని చూస్తూ వదిలేయ లేక, టిఆర్ఎస్ బాగా ఇబ్క్అంది పడుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు