ఎట్టకేలకు మళ్లీ బండ్ల మేకప్‌, ఏ సినిమా కోసమో?  

Bandla Ganesh Ready To Act In Movies-

నటుడిగా కెరీర్‌ను ఆరంభించిన బండ్ల గణేష్‌ కమెడియన్‌ గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.దాదాపు దశాబ్ద కాలం పాటు నటుడిగా కొనసాగిన బండ్ల అదృష్టం బాగుండి నిర్మాత అయ్యాడు.

Bandla Ganesh Ready To Act In Movies-

చేసిన కొన్ని సినిమాలే అయినా పెద్ద స్టార్స్‌తో చేశాడు.అదే అదృష్టం బాగా లేకపోవడంతో మళ్లీ మొదటికి వచ్చాడు.

తీసిన సినిమాల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటంతో బండ్ల గణేష్‌ దారుణమైన ఫలితాలను చవిచూశాడు.గత రెండు మూడు సంవత్సరాలుగా నిర్మాణంకు దూరంగా ఉండి వ్యాపారాలు చూసుకుంటున్న బండ్ల గణేష్‌ మళ్లీ నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

Bandla Ganesh Ready To Act In Movies-


ఆ వార్తలు నిజం కాదేమో అని చాలా మంది భావించారు.కాని అనూహ్యంగా బండ్ల గణేష్‌ ఎట్టకేలకు మొహానికి మేకప్‌ వేసుకున్నాడు.

ఒక స్టార్‌ హీరో సినిమాలో నటిస్తున్నట్లుగా స్వయంగా ప్రకటించాడు.ఆ పాత్ర ఏంటీ, ఆ హీరో ఎవరు అనే విషయం త్వరలోనే వెళ్లడిస్తానంటూ పేర్కొన్నాడు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంటున్నాను అని, మళ్లీ నటించడం కొత్తగా ఉందని, చాలా సంతోషంగా కూడా ఉందని ఆయన అన్నట్లుగా తెలుస్తోంది.

గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచిన బండ్ల గణేష్‌కు దారుణ పరాభవం ఎదురైన విషయం తెల్సిందే.ఎన్నికల్లో కాంగ్రెస్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో తాను పూర్తిగా రాజకీయాలను వదిలేస్తున్నట్లుగా ప్రకటించాడు.రాజకీయాల్లో తను ఇమడలేనంటూ చెప్పుకొచ్చాడు.రాజకీయాల్లో తనలాంటి వారికి స్థానం లేదని పేర్కొన్నాడు.బండ్ల గణేష్‌ ఇకపై వరుసగా చిత్రాలు చేస్తాడని తెలుస్తోంది.

తాజా వార్తలు

Bandla Ganesh Ready To Act In Movies- Related....