మహేష్ దత్తత తీసుకున్న గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ఆశ్చర్యపోతారు   1.57 Cr Worth Development Activities Begin In Mahesh Babu’s Adopted Village     2017-11-09   01:42:11  IST  Raghu V

సినీజవీతంలోనే కాదు, నిజజీవితంలో కూడా శ్రీమంతుడు అనిపించుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు రాష్ట్రాల్లోని రెండు గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి మహేష్ బాబు స్వగ్రామం అయిన బుర్రిపాలెం అయితే, మరొకటి మహబూబ్ నగర్ లోని సిద్ధపూర్. బుర్రిపాలెం లో దత్తత తీసుకున్న ఆరు నెలల కాలంలోనే అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టిన మహేష్, సిద్దాపూర్ విషయానికి వచ్చేసరికి మాత్రం దాదాపుగా రెండేళ్ళ సమయం తీసుకున్నాడు. అయితే పూర్తిస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యంగా మొదలైనా, అడపాదడపా చిన్న చిన్న పనులు, హెల్త్ క్యాంపులు మాత్రం నిర్వహిస్తూనే వచ్చింది మహేష్ బాబు టీమ్. ఓదశలో గ్రామస్తుల మహేష్ బాబు మీద విసుగుని కూడా వ్యక్తం చేసారు. ఆలస్యంగా అయితే అయ్యింది, ఇక జరిగేవి అద్భుతాలే. మొదటి విడత అభివృద్ధి కార్యక్రమాలు కోసం ఏకంగా 1.57 కోట్ల బడ్జెట్ ని విడుదల చేసారు మహేష్ బాబు.

ప్రస్తుతం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇవే :

* 85 లక్షలతో 1.35 ఎకరాల్లో కొత్త పాఠశాల. (నిర్మాణ నమూనాలు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు)

* 15 లక్షలతో గ్రామానికి మెట్రో వాటర్. అలాగే రెండు రోడ్ల నిర్మాణం.

* అంగన్‌వాడీ కేంద్రం మరియు పిల్లలకు ఆటస్థలం. ఈ పనులకు 8.75 లక్షల ఖర్చు.

* ప్రస్తుతం ఉన్న పాఠశాలలో 23 లక్షలతో అదనపు తరగతుల నిర్మాణం.

* అదే పాఠశాలలో 12 లక్షల ఖర్చుతో కంప్యూటర్ ల్యాబ్ పనులు పూర్తి చేసారు.

* ఉన్నత పాఠశాలలో 1.8 లక్షలతో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు.

* 1.25 లక్షల ఖర్చుతో గ్రామంలో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం.

* 2.5 లక్షలతో బస్ షెల్టర్ల నిర్మాణం.

* ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం 8 లక్షల బడ్జెట్ కేటాయింపు.

ఇక్కడితో ఆగిపోలేదు, ఆగిపోదు. గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు తీరాలంటే, మహేష్ బాబు అనుకున్నట్లుగా, సిద్ధాపూరాన్ని ఒక స్మార్ట్ విలేజ్ గా మార్చాలంటే, ఉచిత వైద్యసదుపాయాలు పూర్తిస్థాయి లో అందాలంటే, దాదాపుగా 14 కోట్ల ఖర్చు వస్తుందట. ఇదే ఊపులో, మెల్లిగా అయినా, అనుకున్నది చేయడమే మహేష్ బాబు లక్ష్యం. “పోరా శ్రీమంతుతుడా … పోపోరా శ్రీమంతుడా”