వై ఎస్ వివేకానంద రెడ్డి విషయంలో...సిట్ బృందాన్ని మార్చిన ఏపీ సర్కార్

ఎన్నికల కు కొద్దీ రోజుల ముందు అనగా మార్చి 15 న మాజీ సీ ఎం,దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ఏపీ నూతన సి ఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.అయితే ఎన్నికల కు కొద్దీ రోజుల ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం తో అటు అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ, అలానే వైసీపీ పార్టీ నేతలు అందరూ కూడా మీరంటే మీరంటూ పరస్పర ఆరోపణలు కూడా చేసుకున్నారు.

 1 1ys Rajasheker Reddy Brother Vivekananda Reddy-TeluguStop.com

ఈ క్రమంలో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు కు ఆదేశించింది.ఈ క్రమంలో తాజాగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గతంలో నియమించిన సిట్ బృందాన్ని తొలగించి కడప ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో కొత్త సిట్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

అనంతపురం,చిత్తూరు,తిరుపతి,కడప ఇలా మొత్తం 23 మంది పోలీసు అధికారులతో కలిసి ఈ కొత్త సిట్ బృందం ఏర్పాటు అయ్యింది.ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్ టీమ్… వివేకా ఇంటిని మరోసారి పరిశీలించనున్నట్లు తెలుస్తుంది.

కాగా, మార్చి 15వ తేదీన పులివెందులలోని తన నివాసంలోనే వివేకా దారుణహత్యకు గురయ్యారు.

బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో ఉన్న ఆయన్ని అనుచరులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.

అయితే తొలుత బాత్రూమ్‌కు వెళ్లిన సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో కింద పడిపోయి తీవ్ర గాయాలపాలై మృతిచెందినట్టు భావించారు.కనియె పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మాత్రం ఆయన దారుణ హత్యకు గురైనట్లు తేలడం తో అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించింది.

అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడం తో ఆ కేసు విచారణ కోసం సిట్ బృందాన్ని కూడా మార్చేశారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube