వలసదారులను 'అక్రమ గ్రహాంతరవాసులు' అంటూ వ్యాఖ్యలు చేసిన ట్రంప్  

Trump Told Ice Begin Removing Millions Of Undocumented Migrants Soon-ice,nri,telugu Nri News Updates,trump

మెరికా అధ్యక్షుడు గా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన దగ్గర నుంచి కూడా ప్రవాసీయులు అమెరికా లో నివసించడం కోసం నానా తిప్పలు పడుతున్నారు. ఎప్పుడు ట్రంప్ పాజిటివ్ గా స్పందిస్తారో,ఎప్పుడు నెగిటివ్ గా ప్రవర్తిస్తారో అన్న విషయం మాత్రం అర్ధం కావడం లేదు. అయితే ఆయన తాజాగా వలసవాదులపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు..

వలసదారులను 'అక్రమ గ్రహాంతరవాసులు' అంటూ వ్యాఖ్యలు చేసిన ట్రంప్ -Trump Told ICE Begin Removing Millions Of Undocumented Migrants Soon

అక్రమంగా అమెరికాలో చొరబడి. ఇక్కడే నివాసముంటోన్న లక్షలాది మంది వలసవాదులను తరిమికొడతాం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

‘‘అక్రమంగా అమెరికాలోకి చొరబడి ఇక్కడే ఉంటోన్న ‘ఈ అక్రమ గ్రహాంతరవాసులను’(అక్రమ వలసదారులను) వచ్చే వారం నుంచి ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ బయటకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది అంటూ పేర్కొన్నారు.

వారు ఎంత త్వరగా అమెరికాలోకి చొరబడ్డారో. అంతే త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోతారు అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా మెక్సికో పై ప్రసంశలు కురిపించారు. వలసదారులు మెక్సికోలోకి చొరబడకుండా ఆ దేశం శక్తివంతమైన చట్టాలను తీసుకొచ్చిందని, అది చాలా మంచి చర్య అంటూ ఆయన కితాబిచ్చారు.

అమెరికాలో అక్రమ వలసలను అరికడితే సరిహద్దు సమస్యలకు చరమగీతం పలకొచ్చు అంటూ ట్రంప్ అభిప్రాయపడ్డారు. అయితే అక్కడి సర్వేల ప్రకారం అమెరికాలో దాదాపుగా 12మిలియన్ల మంది అక్రమంగా నివసిస్తున్నట్లు తెలుస్తుంది.