విడ్డూరం : దొంగతనం కోసం వెళ్లిన దొంగను కోటీశ్వరుడిని చేసిన యజమాని  

Thief Become Millionaire With Help Of House Owner-help Of House Owner,robbert,thief,thief Become Millionaire,రాబర్ట్‌కు ఆ ఇంటి యజమాని

మంచి వారికి ఎప్పుడు కూడా మంచే జరుగుతుందని అంటూ ఉంటారు. అయితే కొన్ని సార్లు దొంగలకు కూడా మంచి జరుగుతూ ఉంటుంది. దొంగతనం వెళ్లిన వారికి కొన్ని సార్లు అనుకోని అదృష్టం కలగడం మనం అప్పుడప్పుడు వార్తల్లో చూస్తూ ఉంటాం..

విడ్డూరం : దొంగతనం కోసం వెళ్లిన దొంగను కోటీశ్వరుడిని చేసిన యజమాని -Thief Become Millionaire With Help Of House Owner

ఇప్పుడు నేను చెప్పబోతున్న సంఘటన మరింత ఆశ్చర్యకంగా మీకు అనిపిస్తుంది. దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఈ సంఘటన జరిగింది. తాజాగా ఇది వెలుగులోకి రావడంతో వైరల్‌ అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… దాదాపు మూడు సంవత్సరాల క్రితం రాబర్ట్‌ అనే వ్యక్తి ఇండియానాలో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ జీవనం గడిపేవాడు. అతడు దొంగతనంకు కొత్త అవ్వడం వల్ల దొంగతనం చేస్తూ ఎక్కువ సార్లు పట్టుబడ్డాడు. అయితే కేసులు నమోదు అయినా మళ్లీ దొంగతనం చేసేందుకు అతడు మొగ్గు చూపేవాడు. ఒక రోజు రాబర్ట్‌ తాళం వేసి ఉన్న ఒక ఇంటిని చూశాడు.

ఆ ఇంట్లోకి వెళ్లాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంట్లోకి దూరిన రాబర్ట్‌ ఇళ్లంతా చూస్తున్నాడు. ఫ్రిజ్‌లో బ్రడ్స్‌ ఉంటే తీసుకుని ఇళ్లంతా కలియదిరుగుతున్నాడు.

ఏం తీసుకు వెళ్లాలా అని ఆలోచిస్తున్నాడు.

ఆ సమయంలోనే ఇంటి యజమాని వచ్చాడు. హఠాత్తుగా వచ్చిన ఇంటి యజమానికి చూసి ఎటు వెళ్లాలో తెలియక అలాగే నిల్చున్నాడు. చేతిలో బ్రెడ్‌ ముక్కతో ఉన్న వ్యక్తిని చూసి ఆ ఇంటి యజమానికి దొంగ అని అర్ధం అయ్యింది.

అయితే అతడు ఇన్నో సెంట్‌ దొంగ అని కూడా యజమానికి అర్థం అయ్యింది. రాబర్ట్‌ భయంతో బయటకు పరుగు పెట్టాలనుకున్నాడు. కాని యజమాని దగ్గరకు వెళ్లి నవ్వుకుంటూ మాట్లాడసాగాడు..

రాబర్ట్‌ తన స్టోరీ అంతా చెప్పాడు. తానో కార్పెంటర్‌ను అని, అయితే తనకు ఎక్కడ వర్క్‌ దొరక్క పోవడంతో ఇలా చేయాల్సి వస్తుందని వాపోయాడు. అప్పుడు రాబర్ట్‌కు ఆ ఇంటి యజమాని చిన్న సలహా ఇచ్చి సాయం కూడా చేశాడు.

రాబర్ట్‌కు ఆర్ధిక సాయం చేసి సొంతంగా కార్పెంటర్‌ వర్క్‌ షోరూం పెట్టమని సలహా ఇచ్చాడు. రాబర్ట్‌కు 10 వేల డాలర్ల సాయం చేయడంతో పాటు తనకు తెలిసిన వారితో ఒ స్టోర్‌ను కూడా ఇప్పించాడు. దాంతో మూడు సంవత్సరాల్లోనే రాబర్ట్‌ మంచి స్టోర్‌ యజమాని అయ్యాడు. ప్రస్తుతం రాబర్ట్‌ వద్ద 20 మంది వరకు వర్కర్స్‌ ఉన్నారు. ఇదంతా ఆయన వల్లే అంటూ గతాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాబర్ట్‌ గుర్తు చేసుకున్నాడు.

తనకు ఆ యజమాని సాయం చేసినట్లుగానే రాబర్ట్‌ కూడా ఎంతో మందికి సాయం చేస్తూ ఉన్నాడు.