జూనియర్ ఎన్టీఆర్ ను జగన్ ఇలా వాడుకోవాలనుకుంటున్నాడా ?

ఏపీలో తెలుగుదేశం పార్టీకి కష్టకాలం నడుస్తుండడం, చంద్రబాబు వయస్సు మీరడంతో బాబు తరువాత పార్టీని లీడ్ చేసి ముందుకు నడిపించే నాయకుల కోసం కింది స్థాయి నాయకులు ఎదురుచూపులు చూస్తున్నారు.ఈ క్రమంలో అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు మారుమోగింది.

 1 1jagan Mohan Reddy Plan To Use Juniour Ntr-TeluguStop.com

టీడీపీ పూర్తి బాధ్యతలు ఎన్టీఆర్ తీసుకోబోతున్నాడని, ఇక ఆయనే పార్టీకి రధసారధి అని ప్రచారం జరిగింది.అయితే అవన్నీవట్టి గాలివార్తలే అన్నట్టుగా తేలిపోయింది.

అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను వైసీపీ ప్రభుత్వం తరపున వాడుకునేందుకు జగన్ ప్లాన్ వేశారని, ఇలా చేయడం ద్వారా ప్రభుత్వానికి మరింత క్రేజ్ పెరగడంతో పాటు టీడీపీని ఇరుకున పెట్టేందుకు అవకాశం కలుగుతుందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

జగన్ ప్రభుత్వం అంటే అవినీతి రహిత ప్రభుత్వం అని, మంచి పరిపాలన జగన్ తోనే సాధ్యమని ప్రజల్లో ఒకరకమైన అభిప్రాయం కలుగజేయాలని జగన్ భావిస్తున్నారట.

అంతే కాకుండా ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు జగన్ చర్యలు తీసుకుంటున్నాడట.దీనిలో భాగంగా వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటకం సహా రాష్ట్రంలోని అన్ని రంగాలకు అంబాసీడర్‌లను నియమించాలని జగన్ చూస్తున్నాడట.

వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటకం సహా రాష్ట్రంలోని అన్ని రంగాలకు అంబాసీడర్‌లను నియమించాలని ముఖ్యమంత్రికి కొందరు సలహా ఇచ్చారని తెలుస్తోంది.

ప్రధానంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధిచేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇప్పటికే ప్రకటించారు.

దీనిలో భాగంగా పర్యాటకరంగానికి అంబాసిడర్‌గా జూనియర్ ఎన్టీఆర్‌ను నియమించాలని, దీనికి జూనియర్ ఎన్టీఆర్ ను ఒప్పించాలని ఆయన సన్నిహితుడైన ఓ మంత్రికి జగన్ పురమాయించారట.ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూనియర్ సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు.

ఇటువంటి సమయంలో జూనియర్ ఈ ప్రతిపాదనను ఒప్పుకుంటాడా లేదా అనే సందేహంలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube