మ్యాజిక్‌ పేరుతో గంగా నదిలోకి మ్యుజీషియన్‌, 20 సెకన్లలో వస్తానని 20 గంటలైనా రాలేదు.. అసలేం జరిగింది  

Indian Stuntman Wizard Mandrake 40 Is Missing After Being Lowered Into The Ganges -

కొన్న సార్లు మ్యుజీషియన్స్‌ చేసే మ్యాజిక్‌లు చూస్తుంటే ఒల్లు గగుర్లు పొడుస్తుంది.అసలు అది ఎలా సాధ్యం అనిపిస్తుంది.

Indian Stuntman Wizard Mandrake 40 Is Missing After Being Lowered Into The Ganges

ఒక్కో మ్యాజిక్‌ వెనుక మ్యుజీషియన్స్‌ రోజులు నెలల తరబడి చేసిన ప్రాక్టీస్‌ కష్టం ఉంటుంది.ఏది కూడా వెంటనే చేసేయరు.

దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా జాదూగర్‌ మ్యాజిక్‌ షోకు మంచి పేరుంది.జాదూగర్‌ మంద్‌ రాకేగా మంచి పేరు దక్కించుకున్న చంచల్‌ లాహిరి అనే 40 ఏళ్ల మ్యుజీషియన్‌ ఇప్పుడు కనిపించకుండా పోయాడు.

మ్యాజిక్‌ పేరుతో గంగా నదిలోకి మ్యుజీషియన్‌, 20 సెకన్లలో వస్తానని 20 గంటలైనా రాలేదు.. అసలేం జరిగింది-General-Telugu-Telugu Tollywood Photo Image

అది కూడా మ్యాజిక్‌ చేస్తూ అవ్వడం విచారకరం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… కోల్‌కత్తాలోని హౌరాబ్రిడ్జీ వద్ద భారీగా జనం కూడారు.

అక్కడ చంచల్‌ లాహిరి మ్యాజిక్‌ చేసేందుకు సిద్దం అయ్యాడు.ఆ సాహసం మామూలు సాహసం కాదు.

ఒక గాజు గ్లాస్‌లో అతడిని కాళ్లు చేతులు కట్టి వేసి పెట్టారు.ఆ గాజు గ్లాస్‌ను గంగానదిలో వదిలారు.

ఈ మ్యాజిక్‌ మామూలుగా మరెవ్వరైనా చేసేందుకు అనుమతించరు.కాని చంచల్‌ లాహిరి ఒక ప్రముఖ మెజీషియన్‌.

ఆయన ఏం చేసైనా కూడా అందరిని ఆశ్చర్యపర్చగలడు.అందుకే ఆ సాహసం చేసేందుకు పోలీసులు అతడికి అనుమతించారు.

ఇరవై ఏళ్ల క్రితం కూడా ఇలాంటి సాహసంను అతడు చేశాడు.ఆ సమయంలో కేవలం 20 సెకన్లలో బయటకు వచ్చిన చంచల్‌ లాహిరి ఈసారి కూడా అంతే సమయంలో లేదంటే అంతకు తక్కువ సమయంలోనే బయటకు వస్తానంటూ సాహసంకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది.అందరు చూస్తుండగా వెళ్లిన చంచల్‌ లాహిరి 20 సెకన్లు కాదు కదా 20 నిమిషాలైనా కూడా రాలేదు.దాంతో పోలీసులు మరియు స్థానికులు అప్రమత్తం అయ్యారు.వెంటనే అక్కడ వెదకడం ప్రారంభించారు.కాని అతడి జాడ మాత్రం 20 గంటలైనా పోలీసులు కనిపెట్టలేక పోయారు.

మ్యాజిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగాల్సింది కాస్త ట్రాజిడీగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Stuntman Wizard Mandrake 40 Is Missing After Being Lowered Into The Ganges- Related....