'బంగార్రాజు' అప్‌డేట్‌.. అక్కినేని ఫ్యాన్స్‌కు ఇది ఖచ్చితంగా గుడ్‌ న్యూస్‌  

Good News For Akhineni Nagarjuna Fans Bangarraju Latest Upadate-

అక్కినేని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘బంగార్రాజు’.ఈ చిత్రంలో నాగార్జున మరియు నాగచైతన్య కలిసి నటించబోతున్నారనే విషయం దాదాపుగా ఫైనల్‌ అయ్యింది.దాంతో పాటు ఈ చిత్రంలో నాగార్జున మనవడి పాత్రలో నాగచైతన్య కనిపించబోతున్నట్లుగా కూడా సినీ వర్గాల నుండి లీక్స్‌ వస్తున్నాయి.ఈ నేపథ్యంలో నాగార్జున సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు...

Good News For Akhineni Nagarjuna Fans Bangarraju Latest Upadate--Good News For Akhineni Nagarjuna Fans Bangarraju Latest Upadate-

కళ్యాణ్‌ కృష్ణ ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ దశలో ఉన్నాడు.త్వరలోనే సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది.

Good News For Akhineni Nagarjuna Fans Bangarraju Latest Upadate--Good News For Akhineni Nagarjuna Fans Bangarraju Latest Upadate-

ఈచిత్రం గురించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.మనం చిత్రంలో అఖిల్‌ లాస్ట్‌కు ఎలా అయితే వచ్చి టిస్ట్‌ ఇస్తాడో అలాగే బంగార్రాజు చిత్రంలో కూడా అఖిల్‌ సినిమాలో ఏదో ఒక సమయంలో అయిదు నుండి పది నిమిషాల పాటు ఉండే అవకాశం కనిపిస్తోంది.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో అఖిల్‌ నటించనున్న నేపథ్యంలో అంచనాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.ఈ చిత్రం నాగార్జున చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నాడు..

సోగ్గాడే చిన్ని నాయన చిత్రం వచ్చి మూడు సంవత్సరాలు దాటింది.అప్పటి నుండి కూడా బంగార్రాజు పాత్రతో సినిమా అనుకుంటూ ఉన్నారు.

ఇన్నాళ్లకు ఆ సినిమాకు మోక్షం కలిగింది.ఈ చిత్రంను వచ్చే నెల లేదా ఆగస్టులో సెట్స్‌పైకి తీసుకు వెళ్లి వచ్చే ఏడాది సంక్రాంతికే సినిమాను విడుదల చేయాలని ఆరాటపడుతున్నారు.ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న మన్మధుడు 2 చిత్రం ఆగస్టులో విడుదల అయ్యేందుకు రెడీ అవుతుంది.ఆ తర్వాత బంగార్రాజు చిత్రం మొదలయ్యే అవకాశం ఉంది...