ఎలుకల మందు రుచి చూసిన చర్చి ఫాదర్‌, ఆ తర్వాత ఏం జరిగిందంటే, అసలెందుకు ఇలా చేశాడు?  

Church Father Dies After Tasting Rat Poison In Krishna -

కొన్ని సార్లు మనుషులకు చిలిపి పనులు చేయాలనిపిస్తూ ఉంటుంది.చిల్లరగా ఆలోచించడం, చిలిపిగా ప్రవర్తించడం వంటివి చేస్తూ ఉంటాడు.

Church Father Dies After Tasting Rat Poison In Krishna

ఆ సమయంలో వారు తమను తాము మర్చి పోతారు.తమ హోదా, ఆ తర్వాత జరిగే పరిణామాల గురించి పట్టించుకోరు.

తాజాగా ఛతీస్‌ఘడ్‌కు చెందిన ఒక యువ చర్చి ఫాదర్‌ చేసిన చిలిపి పనికి ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు.ప్రపంచంలో ఇలా మరణించిన వ్యక్తి ఇతడే అయ్యి ఉంటాడని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఎలుకల మందు రుచి చూసిన చర్చి ఫాదర్‌, ఆ తర్వాత ఏం జరిగిందంటే, అసలెందుకు ఇలా చేశాడు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఛతీస్‌ఘడ్‌ జాస్పూర్‌లోని ఈకేల గ్రామానికి చెందిన రాబర్ట్‌ కిస్పోటా అనే యువకుడు కృష్ణ జిల్లాలోని ఒక చర్చిలో ఫాదర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.చర్చిలో ఈమద్య కాలంలో ఎలుకలు ఎక్కువగా ఉంటున్నాయి.

వాటి నివారణకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సఫలం అవ్వడం లేదు.పదుల సార్లు ఎలుకల మందు పెట్టినా కూడా అవి చనిపోవడం లేదు.

దాంతో అసలు ఈ ఎలుకల మందు పని చేస్తుందా లేదా అనే అనుమానం అతడికి వచ్చింది.

అనుమానం వచ్చిందే తడువుగా వెంటనే ఎలుకల మందును నాలుకపై వేసుకుని చప్పరించాడు.వెంటనే అది పని చేయడం ప్రారంభించింది.తీవ్ర వాంతులు అయ్యి ఆపస్మారక స్థితికి వెళ్లి పోయాడు.

హాస్పిటల్‌ లో జాయిన్‌ చేయగా చికిత్స పొందుతు మృతి చెందాడు.ఎలుకల మందు తిన్న వెంటనే అతడిని హాస్పిటల్‌కు తీసుకు వచ్చి ఉంటే బాగుండేది అని డాక్టర్లు అన్నారు.

కాస్త ఆలస్యం అవ్వడం వల్ల అతడి ప్రాణాలు కాపాడలేక పోయామని డాక్టర్లు విచారం వ్యక్తం చేశారు.అయినా ఎలుకల మందును టెస్ట్‌ చేయడం ఏంటీ విడ్డూరం కాకపోతే అంటూ స్థానికులు చనిపోయిన ఫాదర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Church Father Dies After Tasting Rat Poison In Krishna- Related....