అమెరికా అధ్యక్షుడిగా మరో సారి అగ్ర రాజ్యానికి రాజవ్వాలని తపిస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.తన ప్రచార పర్వాన్ని ఇప్పటికే ప్రారంభించిన ట్రంప్ మరో సారి దేశాధ్యక్షుడు అవ్వడమే టార్గెట్ గా పెట్టుకున్నారు.
అందుకోసం 2020 – కీప్ అమెరికా గ్రేట్ అంటూ నినదించారు.కీప్ అమెరికా గ్రేట్ అంటే “అమెరికాని ఉన్నతమైన స్థాయిలోనే కొనసాగిద్దాం”.
ఈ సరికొత్త నినాదంతో ప్రచారం ప్రారంభించిన ట్రంప్ తనదైన రీతిలో దూకుడుగా వెళ్తున్నారు.
ఫ్లోరిడాలో తన ప్రచార పర్వాన్ని అట్టహాసంగా ప్రారంభించారు ట్రంప్.వేల మంది తన మద్దతు దారుల సమక్షంలో ట్రంప్ సుమారు 80 నిమిషాల పాటు ప్రసంగం ఇచ్చారు.తనని మరో సారి ఎన్నికొని అధికారం ఇస్తే దేశ గమనాన్ని పూర్తిగా మార్చేస్తానని అన్నారు.
మరో నాలుగేళ్ళు సమయం ఇవ్వమని దేశం కోసం తానూ రూపొందించిన అభివృద్ధి అజెండాని పూర్తి చేస్తానని అన్నారు.రానున్న ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించడానికి నేను మీ ముందుకు వచ్చాను, విదేశాల ముందు అమెరికాని ఎప్పుడూ తల దించుకునేలా చేయనని మీకు ప్రమాణం చేస్తున్నారు అంటూ ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.ప్రపంచం మొత్తం అమెరికాని చూసి అసూయ పడేలా చేస్తానని హామీ ఇచ్చారు.