బీజేపీలోకి టీడీపీ ఎంపీలు ! బాబు హస్తం ఉందా ?

ఎట్టకేలకు టీడీపీ రాజ్యసభ ఎంపీలు నలుగురు కాషాయ కండువా కప్పేసుకున్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు కి అత్యంత సన్నిహితులుగా ఉంటూ వస్తున్నయలమంచిలి వెంకట సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌ మూకుమ్మడిగా బీజేపీలో చేరిపోయారు.

 1 1 1ap Telugudesham Party Leaders Joined In Bjp Party-TeluguStop.com

అయితే వీరంతా బాబు సూచనా మేరకే బీజేపీలోకి వెళ్లారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.ప్రస్తుతం ఏపీలో టీడీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కుంటూ ఉండడం, కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ, తెలంగాణ లో టీఆర్ఎస్ ఇలా బాబు శత్రువులు అంతా అధికారంలో ఉండడంతో ఇక తనకు, తన సన్నిహితులకు కేసుల బెడద తప్పదని ముందే గ్రహించి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సుజనా చౌదరి, సీఎం రమేష్‌ల వ్యాపార, ఆర్థిక వ్యవహారాలన్నీ చంద్రబాబుకు బినామీలుగానే చేశారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఇక నలుగురు రాజ్యసభ ఎంపీలు పార్టీ మారినా బాబు లో ఎటువంటి ఆందోళన కనిపించడంలేదు.

పైగా ఇదేమి టీడీపీకి కొత్త కాదు అంటూ లైట్ తీసుకుంటున్నారు.గురువారం మ‌ధ్యాహ్నం టీడీపీ నుంచి న‌లుగురు ఎంపీలు బీజేపీలోకి వెళ్లినా బాబు లో పెద్దగా రియాక్షన్ లేకపోవడం అందరికి అనుమానాలు కలిగిస్తోంది.

ఐదేళ్లు అధికారానికి టీడీపీ దూరంగా ఉండాల్సిందే.అధికారం లేక‌పోతే ఏమీ చేయ‌లేరు.పైగా టీడీపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఆదాయానికి ఆస్తులున్న కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.వారు ఇంకా టీడీపీని పట్టుకుని వేలాడితే వారిని కాపాడ‌టం బాబు కి కూడా కుదరని పని.

-Telugu Political News

త‌న కుడిభుజాలైన సీఎం ర‌మేష్‌, సుజ‌నా చౌద‌రి బీజేపీ తీర్థం పుచ్చుకుంటేనే వారికి కేసుల నుంచి రక్షణ లభిస్తుంది.బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం ఎటువంటి భయం ఉండదు.అవసరమైతే ఈ ఐదేళ్ల తరువాత తెలుగుదేశం పార్టీలోకి వారు నిస్సందేహంగా రావొచ్చు అనే ప్లాన్ తో బాబు పూరమాయించినట్టు ఏపీ అధికార పార్టీ వైసీపీ అనుమానిస్తోంది.అదీ కాకుండా చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలసి యూరప్‌ పర్యటకు బుధవారం అలా వెళ్లారో లేదో ఇటు వైపు టీడీపీ ఎంపీలు నలుగురు బీజేపీలో చేరుతున్నట్లు మీడియాకు లీకులు ఇవ్వడం ఇవన్నీ అనేక అనేక అనుమానాలకు కారణం అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube