హెల్మెట్‌తో వెంట్రుకలు రాలుతాయా? యువత ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!

వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి.మన ప్రాణాలు కాపాడుకోవాలంటే హెల్మెట్ ఉండాల్సిందే.

 Does Wearing A Helmet Cause Hair Loss-TeluguStop.com

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నడుమ హెల్మెట్ అవసరం ఎంతో ఉంది.కానీ హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందేమో అనే డౌట్ చాలా మందికి వచ్చే ఉంటది.

ముఖ్యంగా అదే కారణంగా యువత హెల్మెట్ పెట్టుకోడానికి ఇష్ట పడరు.బట్టతల వస్తుంది అని కూడా భయపడుతుంటారు.

మరి ఇందులో నిజం ఎంత? హెల్మెట్ పెట్టుకుంటే వెంట్రుకలపై ఎలాంటి ప్రభావం పడుతుంది.? వివరాలు మీరే చూడండి.!

హెల్మెట్‌ వాడటానికీ జట్టు రాలిపోవడానికి ఎలాంటి సంబంధం లేదు.పైగా హెల్మెట్‌ వల్ల తలకు, జుట్టుకు రక్షణ కలుగుతుంది.మీ జట్టు రాలిపోతుందంటే బహుశా మీ జన్యువుల ప్రభావమే కారణం కావచ్చు.ఇటీవల పురుషుల్లో వచ్చే బట్టతలకు బయోటిన్‌ ఫెనస్టెరైడ్, మినాక్సిడిల్, ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా థెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి

ఇది ఇలా ఉంటె చాలారోజులుగా చుండ్రు సమస్యతో బాధపడేవారు వారానికి రెండు సార్లైనా తలస్నానం చేస్తే బాగుంటుంది అనుకుంటారు.కానీ అలా చేయడం వల్ల జుట్టు మరింత రాలిపోతుందేమో అనే అపోహలో ఉంటారు.మీ మాడు మీద ఉండే సీబమ్‌ అనే నూనెలాంటి స్రావాన్ని వెలువరించే గ్రంథులు అతిగా పనిచేయడం వల్ల మీరు పేర్కొంటున్న సమస్య వస్తుంది.

మీరు జడ్‌పీటీఓ, కెటాకోనజాల్‌ ఉండే షాంపూను వాడండి.మీరు ఈ షాంపూను రోజు విడిచి రోజు వాడవచ్చు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube