తుది దశలో “హెచ్ 4” వీసా రద్దు.. “70 వేల” భారత టెకీలకి షాకే

హెచ్ -1బీ వీసా తో భారతీయలకి చెక్ పెడుతూ వస్తున్న అమెరికా ప్రభుత్వం మెల్ల మెల్లగా హెచ్ -4 స్పౌస్ వీసాపై కూడా ఆంక్షలు పెడుతూ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.అయితే తాజగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే హెచ్ 4 వీసాలను రద్దు ప్రక్రియ జరుగుతుంది ఈ ప్రక్రియ తుది దశలో ఉందని అమెరికా ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది.

 H4 Visas Ban Effect On 70 Thousand Indians Software-TeluguStop.com

అమెరికాలో ఉండే తమ పౌరులకి మాత్రమే ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యం తో ట్రంప్ సర్కార్ హెచ్ 1 బీ వీసాల జారీ నిబంధనలను మరింత కఠినతరం చేసింది.హెచ్ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులకు కల్పించే హెచ్ 4 వీసాల విషయంలో కూడ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకొంది.

అయితే ఈ వీసాలను రద్దు చేసే నిర్ణయం చివరి దశలో ఉందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా కోర్టుకు తెలిపింది

అంతేకాదు ఈ వీసాలని రద్దు చేయడం వలన అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది ఇండియన్ టెక్కీలపై ఆ ప్రభావం కన్పించనుంది.ఈ వీసాలను రద్దు చేసేందుకు అమెరికా సర్కార్ ఆసక్తిని చూపుతోంది.ఇదే విషయాన్ని అమెరికా సర్కార్ ఫెడరల్ కోర్టుకు గురువారం నాడు ప్రకటించింది.అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న కాలంలో హెచ్ 1 బీ వీసాలపై పనిచేస్తున్నవృత్తి నిపుణుల జీవిత భాగస్వామ్యులు హెచ్ 4 వీసాలతో అమెరికాలో నివసించేందుకు అనుమతి ఇచ్చారు.

అయితే ఒబామా సర్కార్ గద్దె దిగిన వెంటనే ట్రంప్ తన పౌరులకి ఇచ్చిన మాట ప్రకారం భారతీయులని.ఇంటికి పంపే పనిలో సర్కారు ఉంది…హెచ్ 4 వీసాదారులు ఉద్యోగం చేయడానికి ఇచ్చే అనుమతులను రద్దు చేయాలని ట్రంప్ సర్కార్ చర్యల వలన సుమారు 70 వేల మంది ఇండియన్ టెక్కీలు ఇక ఇంటి బాట పట్టాల్సిందే…ఇదే జరిగితే ఈ ప్రభావం భారత సాఫ్ట్వేర్ పైన కూడా తీవ్రమైన ప్రభావం కూడా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube