హెచ్చ‌రిక: మ‌రో మూడు రోజుల పాటు త‌ప్ప‌దు

తెలుగు రాష్ట్రాల్లో ప‌లుచోట్ల ఇప్పటికే భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.కొన్నిచోట్ల భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో వ‌ర‌ద దెబ్బ‌కు ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

 Heavey-rains-in-next-3-days-TeluguStop.com

ఇక రోడ్ల‌పై నీళ్లు ఉండ‌టంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇక్క‌ట్లు ప‌డుతున్నారు.వ‌ర‌ద ప్రభావంతో ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్ల‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

వ‌ర‌ద క్ర‌మంలో కొన్ని ప్రాంతాల్లో క‌రెంట్ లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు మ‌రింత ఇబ్బంది ప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలో వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు వెద‌ర్ బులెటిన్ విడుద‌ల చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో రాగ‌ల మూడురోజుల్లో భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని తెలిపారు.కోస్తాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌, తెలంగాణ‌లో ప‌లుచోట్ల అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని పేర్కొన్నారు.

దీంతో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, మ‌త్స్య‌కారులు స‌ముద్రంలో చేప‌ల‌వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ ప్ర‌క‌టించింది.

ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ప్ర‌భావంతో మ‌ధ్య బంగాళాఖాతం ప‌రిస‌ర ప్రాంతాల్లో అల్ప‌పీడ‌నం కొన‌సాగుతుంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది.

మ‌రో 48 గంట‌ల పాటు వాయువ్య దిశ‌గా అల్ప‌పీడ‌నం కొనసాగుతున్న‌ట్లు పేర్కొంది.వాయువ్య దిశ అనంత‌రం ఉత్త‌ర ఈశాన్యంగా ప‌య‌నిస్తుందని వాతావ‌ర‌ణ‌శాఖ అంచ‌నా వేసింది.

అటు హైద‌రాబాద్‌లో రాగ‌ల నాలుగు రోజులు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది.ఈ క్ర‌మంలో అప్ర‌మ‌త్త‌మైన జీహెచ్ఎంసీ సిబ్బంది ర‌వీంద్ర‌భార‌తి వ‌ద్ద 57 బోట్ల‌ను అందుబాటులో ఉంచింది.

ఏపీ నుంచి 10 ప‌ర్యాట‌క బోట్ల‌ను తెలంగాణ తెప్పించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube