'స్ప్రైట్' బ్రాండ్ అంబాసడర్ గా సుశాంత్

వరుస హిట్లతో హీరో సుశాంత్ జోరు మీదున్నారు.తాజాగా ఆయన శీతల పానీయం ‘స్ప్రైట్’తో వాణిజ్య ప్రకటనల (కమర్షియల్ యాడ్స్) ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.

 Sushanth As Sprite Brand Ambassador-TeluguStop.com

సుశాంత్ ఇప్పుడు ‘స్ప్రైట్’కు బ్రాండ్ అంబాసడర్.ఆ బ్రాండ్ కు ఆయన చేసిన మొదటి కమర్షియ యాడ్ విడుదలైంది.

ఇదివరకటి యాడ్స్ తరహాలోనే ఉత్తేజభరితంగా ఉన్న ఈ టీవీ కమర్షియల్ లో సుశాంత్ ఉబర్ కూల్ లుక్స్ లో కనిపిస్తున్నారు.‘స్ప్రైట్’కు తమిళంలో అనిరుధ్ రవిచందర్, హిందీలో ఆయుష్మాన్ ఖురానా బ్రాండ్ అంబాసడర్లుగా వ్యవహరిస్తున్నారు.

Telugu Sprite, Sushanth, Sushanthsprite, Sushanth Latest-Movie

హీరోగా ‘చి.ల.సౌ’ సినిమాతో సక్సెస్ సాధించిన సుశాంత్, దాని తర్వాత ఒక కీలక పాత్ర పోషించిన ‘అల.వైకుంఠపురములో’ చిత్రం సంక్రాంతి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఆయన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే రొమాంటిక్ థ్రిల్లర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube