వైసీపీలో కీల‌క మార్పులు.. మంచికేనా..!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో వైసీపీలో కీల‌క మార్పులు చోటుచేసుకుంటున్నాయి.ప‌లు జిల్లాల్లోని అసెంబ్లీ, పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు గుర్రాల కోసమే ఈ మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

 Changes In Ysrp-TeluguStop.com

ప్ర‌ధానంగా అభ్య‌ర్థుల ఎంపిక విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ అధినేత జ‌గ‌న్ ఈ దిశ‌గా అడుగులు వేస్తున్నారు.అయితే కొన్ని అసెంబ్లీ, పార్ల‌మెంటు స్థానాల‌కు అభ్య‌ర్థులు ఖరారుకాగా, మ‌రికొన్ని స్థానాల‌కు ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది.

ఈ నేప‌థ్యంలోనే ఖరారు కావాల్సిన స్థానాల్లో సామాజిక వ‌ర్గాల ప్రాధాన్యాన్ని జ‌గ‌న్ కీల‌కంగా తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.నిజానికి రాయ‌ల‌సీమ‌లో వైసీపీకి మంచి ప‌ట్టు ఉంది.ఇక్క‌డ కూడా ప‌లు స్థానాల‌కు అభ్య‌ర్థులు ఖ‌రారు కావాల్సి ఉంది.చిత్తూరు ఎంపీ సీటు, హిందూపురం, కర్నూలు, నంద్యాల వంటి సీట్లలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీ చేస్తార‌న్న విష‌యంపై ఇంకా క్లారిటీ లేదు.

మ‌రికొన్ని స్థానాల‌కు మాత్రం ఇప్పుడే అభ్యర్థులు మారుతున్నారు.

కొద్దిరోజుల వ‌ర‌కూ అనంతపురం పార్ల‌మెంటు స్థానానికి అనంత వెంకట్రామిరెడ్డి పేరు విన‌బ‌డ‌గా.

తాజాగా ఆ స్థానంలోకి వేరే అభ్యర్థి వచ్చాడు.బీసీ సామాజికవర్గానికి చెందిన ఈ అభ్యర్థిని బ‌రిలోకి దింపి జేసీ తనయుడిని దీటుగా ఎదుర్కొని గెలువ‌వ‌చ్చ‌నే ఆలోచ‌న‌లో వైసీపీ నేతులు ఉన్నారు.

అయితే అనంతపురం సీటు బీసీ అభ్యర్థికి ఇవ్వడంపై కొంత సానుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయి.కానీ.

ఆ అభ్య‌ర్థి ఇంత త‌క్కువ స‌మ‌యంలోనే జ‌నంలోకి వెళ్ల‌గ‌ల‌రా.? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అదేవిధంగా రాయ‌ల‌సీమ‌లో కీల‌క‌మైన కర్నూలు, నంద్యాల పార్ల‌మెంటు సీట్లకు కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇంకా అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌లేదు.అయితే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు పార్టీ ఇన్‌చార్జ్‌లు ఉన్నారు.

కానీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారికే టికెట్లు ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది.అంతేగాకుండా ప‌లు అసెంబ్లీ స్థానాల్లో కూడా ఇప్పుడున్న అభ్య‌ర్థులు మారే అవ‌కాశాలు ఉన్నాయ‌నే చ‌ర్చ పార్టీ వ‌ర్గాల్లో జోరుగా న‌డుస్తోంది.

అయితే ఎన్నిక‌లకు ఇంకా ఏడాది స‌మ‌యమే ఉన్న త‌రుణంలో ప‌లు స్థానాల్లో మార్పులు మంచివేగానీ.మ‌రీ లేటుగా స్పందిస్తే మాత్రం ఫ‌లితాలు వేరుగా ఉంటాయ‌నే ఆందోళ‌న కూడా పార్టీ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

త్వ‌రగా అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసి, ప్ర‌జ‌ల్లోకి వెళ్తేనే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని అంటున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube