వైరల్ ఫొటోస్: తన మేకోవర్ తో అదరగొడుతున్న అల్లు వారి అబ్బాయి..!

తాజాగా అల్లు వారి అబ్బాయి అల్లు శిరిష్ మేక్ ఓవర్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.ప్రస్తుతం కరోనా సమయం కారణంగా లాక్ డౌన్ సమయంలో కొత్త ఫిట్నెస్ చాలెంజ్ లతో.

 Allu Sirish, Tollywood, Mega Fans, Social Media, Viral Photos,latest-TeluguStop.com

ఫిట్నెస్ గోల్స్ తో మోటివేషన్ అంటూ గంటల తరబడి జిమ్ లలో వర్కౌట్స్ చేస్తూ అల్లు శిరీష్ తన శరీర షేప్ పూర్తిగా మార్చేశాడు.ఇందుకు సంబంధించి తాజాగా అల్లు శిరీష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన మేక్ ఓవర్ సంబంధించి ఫొటోస్ ను పోస్ట్ చేశాడు.

ఈ ఫోటోలలో షర్ట్ లెస్ గా ఫోటోలు దిగి షేర్ చేశాడు అల్లు శిరష్.టాలీవుడ్ ఇండస్ట్రీలో సిక్స్ ప్యాక్ సంస్కృతిని అల్లు వారి పెద్దబ్బాయి అల్లు అర్జున్ మొదలు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.

ఆ తర్వాత టాలీవుడ్ లో ఉన్న అనేక మంది హీరోలు వారి శరీర ఆకృతి పై దృష్టి సారించి వారి మేక్ ఓవర్ లను ఎప్పటికప్పుడు మారుస్తూ ట్రెండింగ్ గా ఉంటున్నారు.

తాజాగా శిరీష షేర్ చేసిన ఫోటోలకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురుస్తోంది.

ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.ఫోటోలో వున్న విధంగా మేక్ ఓవర్ అదిరిపోయింది అంటూ మెగా అండ్ అల్లు ఫ్యామిలీ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక అల్లు శిరీష్ సినిమాల విషయానికి వస్తే ఏబిసిడి అనే రీమేక్ మూవీ సినిమా తర్వాత.ఇప్పటి వరకు ఏ సినిమాను తెర పైకి తీసుకు రాలేక పోయాడు.

ప్రస్తుతం ఈయన ఖాళీ సమయంలో ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టడంతోపాటు కొత్త కథలను వింటూ అతి త్వరలో సెట్స్ పైకి వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాడు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా అల్లు శిరీష్ మేక్ ఓవర్ ఫొటోస్ చూడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube