విమానం ఎక్కిన ఒక వ్యక్తి బాత్రూం డోర్ అనుకుని ఎగ్జిట్ డోర్ తీయబోయాడు..తర్వాత ఏం జరిగిందంటే..

మొదటి సారి విమానం ఎక్కినప్పుడు మనకు తెలియకుండానే ఏదో రకమైన ఆనందం,ఆశ్చర్యం,భయం ఇలా రకరకాల భావనలు కలుగుతుంటాయి.అయితే మాములు బస్సు ప్రయాణం,రైలు ప్రయాణం మాదిరిగా విమాన ప్రయాణం చేయడానికి కుదరదు.

 Goair Passenger Tried To Open Exit Door Mid Air-TeluguStop.com

దానికి కొన్న పద్దతులు పాటించాల్సి ఉంటుంది.అందుకే ఫ్లైట్ ఎక్కగానే అందులో ఉండే ఎయిర్ హోస్టెస్లు మనకు అన్ని జాగ్రత్తలు చెప్తారు.

వాటిని సరిగ్గా అర్దం చేస్కోలేకపోయిన ఒక వ్యక్తి బాత్రూం డోర్ అనుకుని ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేయబోయాడు…అంతే.

ఈ చిత్రమైన సంఘటన ఢిల్లీ నుండి పట్నా వెళ్తున్న గో ఎయిర్ విమానంలో చోటు చేసుకుంది.రాజస్థాన్‌లో బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి తొలిసారిగా విమానం ఎక్కాడు.ఎయిర్ హోస్టెస్ చెప్పిన నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు.

అదే కారణంతో విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఎగ్జిట్ డోర్ వద్దకు వెళ్లి దానిని లాగడానికి ప్రయత్నించాడు.దీంతో విస్తుపోయిన ప్రయాణికులు హాహాకారాలు చేయడంతో సిబ్బంది వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొన్నారు.

అయితే తనకు విమాన ప్రయాణం కొత్త అని వాష్ రూమ్ డోర్‌కి, ఎగ్జిట్ తలుపుకి తేడా తెలుసుకోలేకపోయానని ఆయన తెలిపాడు.విమానం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వగానే.

సిబ్బంది అతన్ని పోలీసులకు అప్పగించారు.వారికి కూడా సదరు వ్యక్తి అదే సమాధానం తెలిపాడు.

తనకు విమాన ప్రయాణం కొత్త అని.అందుకే పొరపాటు జరిగిందని తెలిపాడు.దాంతో పోలీసులు ఆయనను విడిచిపెట్టారు.

అనుకోని పరిణామానికి విమాన సిబ్బంది కూడా తొలుత కొంత భయపడినా.ఆ తర్వాత విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.ఆ వ్యక్తి గనుక బలవంతంగా ఎగ్జిట్ డోర్ తెరిచి ఉంటే.

ప్రమాదం సంభవించి ఉండేదని సిబ్బంది తెలిపారు.ఈ జరిగిన సంఘటన పై నివేదికను ఇవ్వాల్సిందిగా ఇప్పటికే గో ఎయిర్ యాజమాన్యం తమ సిబ్బందిని ఆదేశించింది.

ప్యాసింజర్లకు నిబంధనలను సరైన రీతిలో అర్థం అయ్యేలా విశదీకరించాలని తెలిపింది.గతంలో కూడా జార్ఖండ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది.

రాంచీలోని బ్రిసా ముందా విమానాశ్రయంలో విమానం ల్యాండ్‌ అవుతుందనగా ఓ ప్రయాణికుడు ఎగ్జిట్‌ డోర్ తీసి అందరినీ బెంబేలెత్తించాడు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube