విజయసాయిరెడ్డి, అయ్యన్నపాత్రుడు మధ్య సోషల్ మీడియా వార్

ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం రాజకీయాలు ఏపీలో కాక రేపుతున్నాయి.అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కొద్దిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 Social Media War Between Vijayasaireddy And Ayyannapatrudu Details, Andhra Prad-TeluguStop.com

ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నారంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీ గోడను వైసీపీ ప్రభుత్వం కూల్చివేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది.అధికారుల తీరును నిరసిస్తూ అయ్యన్నపాత్రుడు అనుచరులు, టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

మరోవైపు అయ్యన్న పాత్రుడిని సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కెలుకుతూనే ఉన్నారు.అసలే సాయిరెడ్డి తనకు ఇష్టం వచ్చిన భాషలో ట్వీట్లు చేయడంలో దిట్ట.

అధికారం చేతిలో ఉంది కదా అని నోటికి వచ్చిన తిట్లన్నీ ట్వీట్ల రూపంలో పోస్ట్ చేసేస్తుంటారు.మరి అయ్యన్నపాత్రుడు ఊరికే ఊరుకుంటారా.ఆయన కూడా ట్వీట్ల రూపంలోనే సాయిరెడ్డికి ధీటుగా బదులిస్తున్నారు.

కోర్టు స్టే తెచ్చుకుని టెంపరరీగా అయ్యన్న హ్యాపీ కావచ్చు.

కానీ ఆయన అక్రమణను రుజువు చేస్తాం భారీ యాక్షన్ ఉంటుందని విజయసాయిరెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారు.దీంతో అయ్యన్నపాత్రుడు రంగంలోకి దిగి.

నా ఇంటికి మీ అధికారులెందుకు.నువ్వే రా సాయిరెడ్డి.

ఇద్దరం కలిసి తేల్చుకుందాం అంటూ ఘాటుగా నే రిప్లై ఇచ్చారు.

Telugu Andhra Pradesh, Ayyannavijaya, Ayyannapatrudu, Chandrababu, Cm Jagan, Sip

దాన్ని విజయసాయిరెడ్డి కంటిన్యూ చేస్తూ నరసింహనాయుడు సినిమా డైలాగులు చెప్పారు.ప్లేస్, డేట్, టైమ్ నువ్వు చెప్పు.ఎప్పుడైనా, ఎక్కడైనా తాను వచ్చేందుకు రెడీ అన్నారు.

అంతేకాకుండా అయ్యన్నను పట్టుకుని గంజాయి అయ్యన్, తాగుబోతు అయ్యన్న అని సెటైర్లు వేశారు.దీంతో అయ్యన్న సింగిల్‌గానే రావాలని సాయిరెడ్డికి హితవు పలికారు.

పదహారు నెలలు జైలులో ఉండడం వల్ల పోలీసులు కొట్టిన దెబ్బలకు శరీరంలో మచ్చలు ఏర్పడితే ఆ చారలను చూసుకుని పులి అని సాయిరెడ్డి భ్రమిస్తున్నాడని చురకలు అంటించారు.ఇలా నేను రెడీ అంటే నేను రెడీ అంటూ ఇద్దరి మధ్య సోషల్ మీడియా వార్ జోరుగా జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube