వింత గ్రామం : అక్కడ అందరూ కవలలే.. కవలల గ్రామం ఎక్కడుందో తెలుసా? ఆ గ్రామం గురించి కొన్ని విషయాలు

ప్రపంచం లో ఒక్కో దేశం లో ఒక్కో వింత గ్రామం ఉంటుంది.అటువంటి ఊర్ల గురించి విన్నప్పుడు అరే భలే ఉంది, జీవితం లో ఒక్కసారైనా అలాంటి గ్రామాన్ని చూడాలి అని అనుకుంటాం .

 All Are Twins-TeluguStop.com

అలాంటి గ్రామామే మన దేశం లో ఒకటి ఉంది.ఇంతకీ ఆ గ్రామం ఏంటా? అని అనుకుంటున్నారు కదూ.అదే కవలల గ్రామం.ఈ గ్రామం గురించి మరి కొన్ని విషయాలు

కేరళలోని మలపురం జిల్లాలో ఉన్న కొదిన్హి గ్రామం ప్రపంచంలోనే ఎక్కువమంది కవలలు జన్మించే ప్రదేశంగా గుర్తించబడింది.ప్రతి సంవత్సరం ఇక్కడ ఎక్కువ సంఖ్యలో కవలలు జన్మిస్తున్నారు.2016 లెక్కల ప్రకారం ఇక్కడ 2000 కుటుంబాలు ఉన్నాయి అందులో దాదాపు 400 మంది కవలలు ( 200 పైగా కవల జంటలు ) ఉన్నారు.ప్రతి రెండు మూడు కుటుంబాలలో ఒక కవల జంట పిల్లలు ఉన్నారు.సాధారణంగా భారత కవలల లెక్కల ప్రకారం మన దేశం లో ప్రతి 1000 మందిలో సగటున 8 నుండి 9 కవలల జంటలు జన్మిస్తున్నారు.

కానీ కొదిన్హి గ్రామం లో ఈ సంఖ్య కాస్త ఎక్కువే ఇక్కడ ప్రతి 1000 మంది లో 40 నుండి 50 అండి కవల జంటలు జన్మిస్తున్నారు.

కవలల గ్రామం అని ఎప్పుడు తెలిసిందంటే. ఈ గ్రామంలో 70 ఏళ్ల కిందటి నుండే కవలలు ఎక్కువగా జన్మిస్తున్నారట , అయితే ఇక్కడ ఎక్కువ గా కవలలు ఉన్నారనే విషయం ఆ గ్రామస్తులకు తెలిసింది మాత్రం 2006 సంవత్సరం లో.అసలు విషయానికొస్తే ఆ గ్రామం దగ్గర్లో ఉన్న IISC పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న సమీరా , ఫెమీరా అనే కవల చెల్లెలు వారి తరగతులో ఉన్న వేరే కవల పిల్లలను చూసి వారు ఆ స్కూల్ లో ఎంత మంది కవల జంటలు ఉన్నారో తెలుసుకోవాలని సర్వే చేశారు.ఆ స్కూల్ లో మొత్తం 24 కవల జంట లు ఉన్నారని తెలిసింది.ఆది ఆ గ్రామ పెద్దలకు చేబితే ఊరిలో మొత్తం సర్వే చేయగా 2006 లో ఆ గ్రామంలో 200 కవల జంటలు ఉన్నారని తెలిసింది.

తరువాత ఆ గ్రామం పేరు వార్తల్లో నిలిచాక ఆ గ్రామం లో అసలు ఎక్కువ మంది కవలలు ఎందుకు జన్మిస్తున్నారు అని వివిధ పరిశోధన విభాగాలు వచ్చి చూసిన వారికి ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు లభించలేదు.

ఆ గ్రామస్తులను ఈ విషయం గురించి అడగగా వారు ఆ గ్రామం లో ఉన్న వాళ్లనే పెళ్లి చేసుకుంటున్నామని అందుకే ట్విన్స్ బర్త్ కి కారణం అని అందరు చెప్పుకొచ్చారు కానీ ఇక్కడి మహిళలు,పురుషులు వేరే గ్రామాలకు చెందిన వారిని పెండ్లి చేసుకున్నా, వారికీ కవలలు పుట్టడం మాత్రం ఆగలేదు ఇది డాక్టర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఇటువంటి వింత కవల గ్రామం బ్రెజిల్ దేశం లో కూడా ఒకటుంది…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube