వాట్సాప్ లో దిమ్మదిగిరిపోయే అప్డేట్ ... షాక్ అయిపోతారు

ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు తొందరపాటులో, తడబాటులో ఎదో ఒక మాట అనేస్తాం.ఆ ఒక్క మాట వలనే మాటా మాటా పెరిగి అది కాస్త గొడవగా మారవచ్చు.

 Whatsapp To Introduce Undo Message Option-TeluguStop.com

ఓ ఒక్క మాటే ఆ వ్యక్తికీ మనపైన నెగెటివ్ ఇంప్రెషన్ పడేలా చేయవచ్చు.అప్పుడు అనుకుంటాం … అర్రెరే .ఈ మాట అనాల్సింది కాదు నేను, అనవసరంగా అనేసాను అని.ఇలా కేవలం నోరు జారడమే కాదు, కీబోర్డు జారడం కూడా చేస్తుంటాం మనం.అంటే వాట్సాప్ లో చాట్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని పదాలు వాడి, కొన్ని మాటలు పంపి, ఆ తరువాత బాధపడుతూ ఉంటాం.పంపిన మెసేజ్ ఆ వ్యక్తి చదవకుండా ఆపలేం, ఆ వ్యక్తిని మీ మెసేజ్ చేరేలోపే డిలీట్ చేయడం కూడా కుదరదు.

కాని ఇకనుంచి అలా కుదరోచ్చు.అదే ఆలోచనలో ఉంది వాట్సాప్.

మీరు పంపిన మెసేజ్ ని మీ చాట్ విండోలోనే కాదు, అవతలి వ్యక్తీ చాట్ విండోలో కూడా కనబడకుండా డిలీట్ చేయవచ్చు.అంటే ఆ వ్యక్తిని మెసేజ్ చేరకముందే, మీరు వాడిన పదాలు మీకు తప్పుగా అనిపిస్తే డిలీట్ చేసి పడేయోచ్చు అన్నమాట.

ఇలాంటి ఆప్షన్ ఇదేమి కొత్త కాదు.ఒకప్పుడు ట్విట్టర్ లో ఇలాంటి ఆప్షన్ ఉండేది.

ఇంస్టాగ్రామ్ లో నిన్నగాక మొన్న వచ్చిన టెలిగ్రాంలో కూడా ఇలా చేయవచ్చు.అయితే ఈ ఆప్షన్ ని ట్విట్టర్ పక్కనపెట్టేసింది.

మెసేజ్ మీరు డిలిట్ చేస్తారు కాని, అది అవతలి వ్యక్తి హిస్టరీ నుంచి డిలీట్ కాదు.కాని అలాంటి ఆప్షన్ ని వాట్సాప్ అందించే ప్రయత్నాల్లో ఉంది.

కాని ఇక్కడ ఓ ట్విస్టు ఏమిటంటే, ప్రస్తుతానికైతే మీరు మెసేజ్ డిలీట్ చేసినట్లు అవతలి వ్యక్తి కి తెలిసిపోతుంది.This message is deleted అని చాట్ విండోలో కనిపించనుంది.

అయితే దీనికే ఫిక్స్ అయిపోకండి.ఎందుకంటే ఈ ఆప్షన్ ఇంకా బేటా యూజర్లకు కూడా రాలేదు.

ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది.

మరికొన్ని రోజుల్లో ఈ ఆప్షన్ ని బేటా యూజర్లపై ప్రయోగించనుందట.

ఆ స్పెషల్ యూజర్లపై ప్రయోగించిన తరువాత, కావాల్సిన మార్పులు, చెరుపులు చేసి ఆప్షన్ ని ఇద్దామా, లేక ఇలాంటి ప్రయత్నమే మానుకోవడమా అనేది వాట్సాప్ చేతిలోనే ఉంది.మనకైతే ఇలాంటి ఆప్షన్ అత్యవసరం.

మరి మెసేజింగ్ ప్రపంచం వాట్సాప్ ఏం చేస్తుంది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube