లేని ట్రాఫిక్‌ను ఉన్నట్లు చూపించి..గూగుల్‌ను ఫూల్ చేశాడు

ప్రస్తుతం ప్రపంచాన్ని గూగుల్ నడిపిస్తున్న సంగతి తెలిసిందే.చిన్న చిన్న పనుల నుంచి వ్యాపార లావాదేవీల వరకు ఈ సెర్చింజిన్ చక్కబెట్టేస్తోంది.

 Telugu News Telugu NRI-TeluguStop.com

గూగుల్ అందించే ప్రధాన సేవల్లో గూగుల్ మ్యాప్స్ ఒకటి.గతంలో కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అడ్రస్‌లు వెతుక్కోలేక ఎందరో తికమక పడ్డారు.

అయితే గూగుల్ మ్యాప్స్ వచ్చాక పరిస్ధితి చాలా సులువైంది.ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మనం వెళ్లాలనుకునే ప్రదేశానికి సంబంధించిన వివరాలను టైప్ చేస్తే పక్కా ఖచ్చితత్వంతో ఏమాత్రం కన్‌ఫ్యూజ్ చేయడకుండా దారి చూపిస్తుంది.

అలాంటి గూగుల్‌కే ఓ వ్యక్తి మస్కా వేశాడు.99 స్మార్ట్‌ఫోన్లు ఉపయోగించి కృత్రిమంగా నకిలీ ట్రాఫిక్ జామ్‌ను సృష్టించాడు.వివరాల్లోకి వెళితే.జర్మనీ రాజధాని బెర్లిన్‌కు చెందిన సైమన్ వెకర్ట్ అనే ఆర్టిస్ట్ 99 స్మార్ట్‌ఫోన్లలో లోకేషన్ ఆప్షన్‌ను ఏనేబుల్ చేసి ఓ చిన్న బండిలో వాటిని ఉంచి దానిని లాక్కుంటూ బెర్లిన్‌లోని బిజీ రోడ్లపై తిరిగాడు.

సైమన్ రోడ్ల వెంట తిరుగుతుండటంతో గూగుల్ మ్యాప్స్ స్మార్ట్‌ఫోన్లలోని లోకేషన్ మోడ్ ఆధారంగా ఆ ప్రాంతాల్లో భారీగా వాహనాలు తిరుగుతున్నట్లుగా భావించి అక్కడ ట్రాఫిక్ జామ్ అయినట్లుగా గూగుల్ మ్యాప్స్‌లో ఎరుపు రంగు గుర్తును చూపించింది.

Telugu Google, Simon Weckert, Smart Phone, Telugu Nri Ups-

అయితే నిజానికి ఆ సమయంలో బెర్లిన్‌లో సైమన్ తిరిగిన మార్గాల్లో జన సంచారం కానీ, వాహనాల రద్దీ కానీ లేకుండా ఖాళీగా ఉన్నాయి.అలా అతను ఏకంగా గూగుల్‌నే బోల్తా కొట్టించాడు.స్మార్ట్‌ఫోన్లలో ఉండే లోకేషన్ మోడ్ సాయంతో రోడ్ల మీద ఎన్ని వాహనాలు ఉన్నాయి అనేది గూగుల్ మ్యాప్స్‌లో చూపిస్తుంది.

ఒకవేళ ఎక్కువ ఫోన్లలో లోకేషన్ మోడ్ ఆన్‌లో ఉంటే ఆ మార్గాన్ని ఎరుపు రంగులో చూపిస్తూ ట్రాఫిక్ జాం అయినట్లు తెలుపుతుంది.తద్వారా వాహనదారులు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కోకుండా మరో రోడ్డులో ప్రయాణిస్తారు.

అయితే సైమన్ ప్రయోగం కారణంగా ఈ వ్యవహారంలో లోపం ఉన్నట్లుగా తేలడంతో గూగుల్ సరిచేస్తే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.కాగా తన ప్రయోగం మొత్తాన్ని సైమన్ వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube