లిఫ్టులో ఆమెకు ముద్దు పెట్ట‌బోయాడు.. వెనుక‌నున్న వ్య‌క్తిని చూసి షాక‌య్యాడు

ఒంటరిగా అమ్మాయి క‌నిపిస్తే చాలు.కొంద‌రు కుర్రాళ్లు అసభ్యకర చేష్ట‌ల‌కు పాల్ప‌డుతుంటారు.

 Girl Molested Boy Kiss In Lift Her Father Reached-TeluguStop.com

ఇలాంటి ఉదంతాలు మ‌నం చాలానే చూసివుంటాం.ఇలాంటి ఘ‌ట‌నే ఓ అమ్మాయికి లిఫ్ట్‌లో ఎదురైంది.

ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసిన ఓ కుర్రాడు బలవంతంగా ఆమెను ముద్దు పెట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు.అయితే అమ్మాయి అతనిని వెనక్కి నెట్టేసింది.

ఇంత‌లో లిఫ్ట్ తెరుచుకుంది.అక్క‌డ ఆ అమ్మాయి తండ్రి ఉన్నాడు.

ఈ ఘటన రష్యాలోని సుర్గుట్ నగరంలో చోటు చేసుకుంది.డైలీ మెయిల్ కథనం ప్రకారం, స్థానికంగా ఉన్న‌ ఒక ఫ్లాట్‌లో 15 ఏళ్ల యువ‌తి లిఫ్ట్‌లో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆమె లిఫ్టులో ఉన్న స‌మ‌యంలో లిఫ్ట్‌లోకి 27 ఏళ్ల కుర్రాడు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించాడు.అయితే ఆమె లిఫ్ట్‌ మూసే ప్ర‌య‌త్నం చేయ‌డంతో ఆ కుర్రాడు కోపంతో అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు.

ఆమెకు బలవంతంగా ముద్దుపెట్టే ప్ర‌య‌త్నం చేశాడు.దీంతో ఆ యువ‌తి అతడిని వెనక్కి నెట్టేందుకు ప్రయత్నించినా ఫ‌లితం లేక‌పోయింది.

అయితే ఇంత‌లో ఒక్కసారిగా లిఫ్ట్‌ తెరుచుకోవడంతో బాలిక తండ్రి లిఫ్ట్ ఎదుట ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు.జ‌రిగిన ఘ‌ట‌న‌ను గ్ర‌హించిన‌ ఆమె తండ్రి ఆ యువకునిపై విరుచుకుపడ్డాడు.

ఆ కుర్రాడి మెడ పట్టుకుని, లిఫ్ట్ నుంచి బయటకు లాగాడు.అప్ప‌టికే అక్క‌డికి జ‌నం వ‌చ్చారు.

ఆ అమ్మాయి తండ్రి ఆ కుర్రాడు చేసిన పనిని అక్క‌డున్న‌వారికి వివరించాడు.ఇంతలో ఎవరో పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకుని, ఆ కుర్రాడిని అరెస్టు చేశారు.

కేసు న‌మోదు చేసుకుని, ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube