“లక్ష డాలర్లు” గెలుచుకున్న “భారత ఎన్నారై” ..

భారతీయులు ఏ దేశంలో ఉన్నా సరే తమ తమ ప్రతిభా పాటవాలు చక్కగా ప్రదర్శిస్తారు అనడానికి ఎన్నో సందర్భాలు ఉన్నాయి.ఎంతో మంది భారతీయులు ఎంతో చక్కని ప్రతిభని కనబర్చుతూ రికార్డులు సృష్టిస్తూనే ఉంటారు…అయితే తాజాగా అమెరికాలో భారత సంతతికి చెందిన ఒక యువకుడు ఏకంగా లక్ష డాలర్ల బహుమతిని గెల్చుకున్నాడు.

 Indian American Teen Wins Usd 100000 In A Us Quiz Show-TeluguStop.com

అసలు ఏమిటా రికార్డు.ఎందుకు లక్ష డాలర్లు.

ఏమిటా విశేషం అనే వివరాలలోకి వెళ్తే.

దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా నిర్వహించే పోటీ పరీక్షల్లో అమెరికాలో భారత సంతతికి చెందిన యువకుడు లక్ష డాలర్ల బహుమతి గెలుచుకున్నాడు…జియోపార్డీ కళాశాలలో జరిగిన క్విజ్‌ పోటీలో ధ్రువ్‌ గౌర్‌ అనే యువకుడు ఈ బహుమతి మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు.ధ్రువ్‌ ఐవీ లీగ్‌ బ్రౌన్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడు.అమెరికాలో ఈ క్విజ్‌ చాలా పాపులర్‌.

దేశవ్యాప్తంగా టీవీ ఛానెళ్లలో ప్రసారమవుతుంది.

అయితే గత రెండురోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో సెమీ ఫైనల్లో మరో భారతీయ అమెరికన్‌ రిశాబ్‌ జైన్‌ను ఓడించి ధ్రువ్‌ ఫైనల్‌కు చేరాడు.

ఇక్కడ విశేషం ఏమిటనే సెమి ఫైనల్స్ వరకూ కూడా ఒక్క అమెరికన్ కూడా పోటీ లేకపోవడం భారత అమెరికన్స్ పోటీగా ఉండటం విశేషం

ఇదిలాఉంటే ఈ పోటీ పరీక్షలో ధ్రువ్‌ అద్భుతంగా రాణించి 1600 స్కోర్ సాధించాడు.పోటీలో గెలుచుకున్న డబ్బును దాచుకుని చదువు పూర్తిచేయడానికి ఉపయోగించుకుంటానని, భవిష్యత్తు అవసరాలకు వాడుకుంటానని వెల్లడించారు.2017 ఎడిషన్‌ పోటీలో భారతీయ అమెరికన్‌ విరాజ్‌ మెహతా మూడో స్థానంలో నిలిచాడు.అయితే ఒక వివాదంలో చిక్కుకోవడంతో మొత్తాన్ని వదులుకోవాల్సి వచ్చింది.2001 లో కూడా భారతీయ సంతతికి చెందిన బాలుదికే ఈ రికార్డు దక్కింది మొత్తంగా ఎక్కువ శాతం భారతీయ ప్రవాసుల సంతతులే ఈ రికార్డు సొంతం చేసుకోవడం హర్షణీయం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube